అత్యంత నాణ్యతతో కూడిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచదేశాలకు అందుబాటు ధరలో తీసుకొచ్చేందుకు చతుర్భుజ కూటమి(క్వాడ్) తీసుకున్న నిర్ణయాన్ని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రశంసించింది. అమెరికా మొదటి నుంచి అనుసరిస్తున్న మేథో సంపత్తికి సహకారం, పరిశోధన-అభివృద్ధి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం కరోనా అంతానికి అత్యావశ్యమని అభిప్రాయపడింది.
నాలుగు దేశాల నవకల్పనల సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యంతో పాటు మౌలికవసతులను జోడించడం ద్వారా మహమ్మారి వినాశనానికి జరుగుతున్న పోరు మరింత బలోపేతం అవుతుందని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఈ నాలుగు దేశాలు చేస్తున్న కృషిలో తాము భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పింది.
ఇదీ చూడండి: బంగాల్లో భాజపా పక్కా స్కెచ్.. 109 స్థానాల్లో ట్రబుల్ షూటర్స్