అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల్లో వైదొలగనున్న తరుణంలో వాషింగ్టన్లో ఆయన మద్దతుదారులు భారీ ఆందోళన చేపట్టారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ భేటీ అయింది. అయితే.. ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటోల్ భవనం వద్ద చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఘర్షణకు దిగారు నిరసనకారులు. బారికేడ్లను నెట్టివేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు.. తొలుత పెప్పర్ స్ప్రేలను ప్రయోగించారు.
![US Capitol locked down as Trump supporters clash with police; security breach reported](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10146550_us-protest4.png)
![US Capitol locked down as Trump supporters clash with police; security breach reported](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10146550_us-protest1.png)
మూతపడిన క్యాపిటోల్ భవనం..
అయితే.. పరిస్థితిని అదుపులోకి రాకపోవడం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరికీ స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఘర్షణల నేపథ్యంలో చట్టసభల సభ్యులు లోపల ఉండగానే క్యాపిటోల్ భవనాన్ని మూసివేశారు. బయటివారు లోపలకు, లోపలవారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు బలగాలను మోహరించారు.
![US Capitol locked down as Trump supporters clash with police; security breach reported](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10146550_us-protest3.png)
![US Capitol locked down as Trump supporters clash with police; security breach reported](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10146550_us-protest5.png)
ఘర్షణలపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ అంటే శాంతి భద్రతలను కాపాడే పార్టీ అని గుర్తు చేశారు. అయితే.. తన మద్దతుదారులు తక్షణమే క్యాపిటోల్ భవనం వదిలి వెళ్లేలా చేయాలని.. అగ్రరాజ్య ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ట్రంప్‌ను కోరారు.
ఇదీ చదవండి: యూఎస్ కాంగ్రెస్ వద్ద తుపాకుల మోత