ETV Bharat / international

చైనాకు ట్రంప్ షాక్​- మరో 4 సంస్థలు బ్లాక్​లిస్ట్ - చైనాపై మరిన్ని ఆంక్షలు

చైనాకు చెందిన మరో నాలుగు సంస్థలను బ్లాక్​లిస్ట్​లో చేర్చింది అమెరికా. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో అగ్రరాజ్య సాంకేతికతను, పెట్టుబడులు పొందటాన్ని ఆపేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది అమెరికా రక్షణ శాఖ.

America defense department
చైనాకు ట్రంప్ షాక్​.. బ్లాక్​లిస్ట్​లోకి మరో 4 సంస్థలు
author img

By

Published : Dec 4, 2020, 12:37 PM IST

చైనాపై మరోసారి ఆంక్షల అస్త్రాలను సంధించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందనే కారణంతో చైనాకు చెందిన అతిపెద్ద చిప్​ తయారీ సంస్థ, ప్రభుత్వ చమురు సంస్థ సహా నాలుగు కంపెనీలను​ బ్లాక్​లిస్ట్​లో పెట్టినట్లు ప్రకటించింది అగ్రరాజ్య రక్షణ శాఖ. డ్రాగన్​ సైన్యానికి మద్దతిచ్చే చైనా కంపెనీలు అమెరికా సాంకేతికత, పెట్టుబడులు పొందకుండా నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

" ఈరోజు అమెరికాలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పనిచేస్తోన్న మరిన్ని కమ్యూనిస్ట్​ చైనా మిలిటరీ సంస్థల పేర్లను రక్షణ శాఖ విడుదల చేసింది. బ్లాక్​ లిస్ట్​లో పెట్టిన చైనా సంస్థల్లో.. సెమీకండక్టర్​ మ్యానుఫ్యాక్చరింగ్​ ఇంటర్నేషనల్​ కార్పొరేషన్​ (ఎస్​ఎంఐసీ), చైనా నేషనల్​ ఆఫ్​షోర్​ ఆయిల్​ కార్పొరేషన్​ (సీఎన్​ఓఓసీ), చైనా కన్​స్ట్రక్షన్​ టెక్నాలజీ కంపెనీ (సీసీటీసీ), చైనా ఇంటర్నేషనల్​ ఇంజినీరింగ్​ కన్సల్టింగ్​ కార్పొరేషన్​ (సీఐఈసీసీ) ఉన్నాయి. పీపుల్స్​ రిపబ్లిక్​ ఆఫ్​ చైనా మిలిటరీ, సివిల్​ కుమ్మక్కు​ వ్యూహాన్ని బయటపెట్టటానికి, ఎదుర్కోవటానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం."

- అమెరికా రక్షణ శాఖ

ప్రస్తుత నిర్ణయంతో.. బ్లాక్​లిస్ట్​లో పెట్టిన సంస్థల సంఖ్య 35కు చేరింది. గతంలో ఈ ఏడాది జూన్​లో తొలి జాబితాను కాంగ్రెస్​కు అందించింది రక్షణ శాఖ.

జనవరి 20న అధ్యక్షుడిగా జో బెడెన్​ బాధ్యతలు చేపట్టేలోపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చైనాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనా ఖండన..

సాంకేతిక పరిజ్ఞానం, ఇతర రంగాల్లోని చైనా పోటీదారులను అణచివేసేందుకే అమెరికా ఇలా చేస్తోందని విమర్శించింది చైనా. తమ సంస్థలపై నిషేధం విధించటాన్ని తప్పుపట్టింది.

ఇదీ చూడండి: చైనాకు ట్రంప్ మరో షాక్- పెట్టుబడులపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.