ETV Bharat / international

వైరస్​ భయం- 100 దేశాల కుక్కలపై నిషేధం - US bans dogs latest news

వందకుపైగా దేశాల నుంచి శునకాలను తీసుకురావడాన్ని నిషేధించింది అమెరికా. ఆ దేశాల్లో ఇంకా రేబిస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్య వైద్యాధికారులు తెలిపారు.

US bans dogs
కుక్కలపై నిషేధం
author img

By

Published : Jun 15, 2021, 7:32 PM IST

తమ దేశ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వందకుపైగా దేశాల నుంచి శునకాలను తీసుకురావడాన్ని నిషేధించింది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యాధికారులు తెలిపారు. ఈ నిషేధం జులై 14 నుంచే అమలవుతున్నట్లు వెల్లడించారు. ఆయా దేశాల్లో ఇప్పటికీ రేబిస్​ వ్యాధి వ్యాపిస్తుండటమే ఇందుకు కారణమని తెలిపారు.

నిషేధం అందుకే...

4 నెలలకన్నా తక్కువ వయసు ఉన్న కుక్కలకు రేబిస్ టీకా వేయకూడదు. అయితే శునకాల వయసును తప్పుగా చూపించి, అమెరికాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసులు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అంటు వ్యాధుల నివారణ కేంద్రం నిషేధం ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికాకు విదేశాల నుంచి వచ్చేవారు ఏటా 10 లక్షల శునకాలను తీసుకొస్తుంటారని అంచనా.

ఇదీ చూడండి: షికాగోలో కాల్పులు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.