ETV Bharat / international

భారత​ ప్రయాణికులపై అమెరికా నిషేధం అమలు - అమెరికా ప్రయాణ ఆంక్షలు

దేశంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని.. భారత్​ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై అమెరికా విధించిన నిషేధం మంగళవారం అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

US, President Biden
అమెరికా, బైడెన్​
author img

By

Published : May 4, 2021, 1:28 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్​ నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులపై ఆ అధ్యక్షుడు జో బైడెన్ విధించిన నిషేధాజ్ఞలు మంగళవారం అమల్లోకి వచ్చాయి. కొన్ని వర్గాల విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయుల వంటి వారికి నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు. అమెరికన్లు సహా.. గ్రీన్​ కార్డులు కలిగినవారు, వారి జీవిత భాగస్వాములు (వయోవృద్ధులు కానివారు), 21ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారి పిల్లలు ఈ జాబితాలో ఉన్నారు.

తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని బైడెన్​ ప్రభుత్వం తెలిపింది. యూఎస్​లోకి ప్రవేశించాలనుకునేవారు.. ఆయా నిబంధనలతో పాటు 14 రోజులు ప్రత్యేక నిర్బంధంలో ఉండాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు బైడెన్.

అయితే.. ఆరోగ్య, మానవ సేవల విభాగంలోని సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​(సీడీసీ) సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అగ్రరాజ్యం వెల్లడించింది. భారత్​లో కరోనా కేసులు భారీగా పెరగడమే ఇందుకు కారణమని చెప్పింది.

ఇదీ చదవండి:కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.