ETV Bharat / international

ఆస్ట్రాజెనెకా టీకా ఫలితాల్లో 'పాత డేటా'! - అస్ట్రాజెనెకా సమర్థతపై యూఎస్​ అనుమానం

అస్ట్రాజెనెకా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్​పై అనుమానాలు వ్యక్తం చేసింది అమెరికా. కొవిడ్​ కేసుల కట్టడిలో ఈ టీకా 79శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని సంస్థ వెల్లడించిన నేపథ్యంలో.. ఆ వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయంటూ యూఎస్​ ఆరోగ్య శాఖ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. కొవిడ్​ టీకాపై తమ దేశంలో నిర్వహించిన క్లినికల్​ ట్రయల్స్ వివరాల్లో పాత సమాచారాన్ని ఉపయోగించి ఉండొచ్చని భావించింది.

US: AstraZeneca may have used outdated info in vaccine trial
ఆస్ట్రాజెనెకా టీకా ఫలితాల్లో 'పాత డేటా'!
author img

By

Published : Mar 24, 2021, 5:51 AM IST

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్‌-19 టీకాపై తమ దేశంలో నిర్వహించిన క్లినికల్‌ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ వివరాల్లో 'పాత డేటా'ను వినియోగించి ఉండొచ్చని పేర్కొంది. దీనివల్ల ఆ వ్యాక్సిన్‌ సమర్థత వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని ఆ దేశ ఫెడరల్‌ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. అయితే.. తమ డేటాలో ఫిబ్రవరి 17 వరకూ నమోదైన కేసుల వివరాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఆ తర్వాత వెలుగుచూసిన కేసులపై విశ్లేషణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇప్పటికే తాము వెల్లడించిన డేటాకు అనుగుణంగానే ఉందని వివరించింది. దీనిపై 48 గంటల్లో తాజా సమాచారాన్ని వెలువరిస్తామని తెలిపింది.

79 శాతం సమర్థతతో..

ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి అమెరికాలో నిర్వహించిన ప్రయోగాల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. అన్ని వయసుల వారిలోనూ బలమైన రక్షణను తమ టీకా కల్పించిందని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ కేసులను నివారించడంలో ఇది 79 శాతం సమర్థతను చాటిందని తెలిపింది. ప్రయోగంలో భాగంగా టీకా పొందిన వారిలో తీవ్రస్థాయి అనారోగ్యం తలెత్తలేదని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ వల్ల తీవ్రస్థాయి దుష్ప్రభావాలేమీ లేవని స్వతంత్ర పర్యవేక్షకులూ నిర్ధారించినట్లు చెప్పింది. ఐరోపాలోని పలు దేశాల్లో వెలుగుచూసిన విధంగా రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలేమీ జరగలేదని తెలిపింది. ఈ టీకా పొందినవారిలో కొందరికి ఈ ఇబ్బంది తలెత్తిందని చెబుతూ ఐరోపాలోని అనేక దేశాలు దీని సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశాయి. రక్తంలో గడ్డలు ఏర్పడటానికి ఈ టీకా కారణం కాదని ఐరోపా ఔషధాల సంస్థ ప్రకటించినప్పటికీ.. కొన్ని దేశాల్లో ప్రజలు ఆ వ్యాక్సిన్‌ పట్ల మక్కువ చూపడంలేదని నిపుణులు చెప్పారు.

ఆ అసాధారణ ప్రకటనతో..

ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ పట్ల ఉన్న అనుమానాలను పటాపంచలు చేసి, ప్రపంచవ్యాప్తంగా దీని విశ్వసనీయతను పెంచేందుకు తాజా ప్రయోగ ఫలితాలు దోహదపడతాయని విశ్లేషకులు భావించారు. ముఖ్యంగా.. అమెరికాలో ఈ టీకా వినియోగానికి ఆమోదముద్ర పడుతుందని అంచనా వేశారు. అయితే అస్ట్రాజెనెకా ప్రయోగ ఫలితాల్లో.. పాత డేటా కూడా ఉండొచ్చంటూ 'అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల పరిశోధన సంస్థ' విడుదల చేసిన అసాధారణ ప్రకటన కలకలం సృష్టించింది.

"టీకా సమర్థతకు సంబంధించిన సమాచారంపై సమీక్ష కోసం డేటా, భద్రత పర్యవేక్షణ బోర్డు (డీఎస్‌ఎంబీ)తో కలిసి పనిచేయాలని ఆ సంస్థకు సూచిస్తున్నాం. తద్వారా వ్యాక్సిన్‌ సమర్థతపై మరింత కచ్చితమైన, తాజా డేటాను సాధ్యమైనంత త్వరగా బహిరంగపరచడానికి వీలవుతుంది" అని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు ఒక దరఖాస్తును దాఖలు చేయాలని ఆస్ట్రాజెనెకా భావిస్తోంది. ఈ దరఖాస్తులోని ఆధారాలపై ప్రభుత్వ స్వతంత్ర సలహాదారులు బహిరంగంగా చర్చించే వీలుంది. మరోవైపు క్లినికల్‌ ప్రయోగ డేటా నిర్వహణ అంశంలో ఆస్ట్రాజెనెకా అధికారులు మొదటి నుంచీ పాల్పడుతున్న తప్పిదాల వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: జోరుగా వ్యాక్సినేషన్​- 5 కోట్లకుపైగా డోసులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.