ETV Bharat / international

భారత్​కు సైనిక సామగ్రి విక్రయానికి యూఎస్​ ఆమోదం - US approves sale of USD 90 mn worth of military equipment

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్​, అమెరికా మరో ముందడుగు వేశాయి. భారత అవసరాల నిమిత్తం.. 90 మిలియన్​ డాలర్లు (రూ.663కోట్లకుపైనే) విలువైన మిలిటరీ సామగ్రి, సీ-130 జే సూపర్​ హెర్క్యులస్​ కార్గో యుద్ధ విమానం విడిభాగాలను అమ్మేందుకు యూఎస్​ సమ్మతించింది.

US approves sale of USD 90 mn worth of military equipment and services to India
భారత్​కు మిలిటరీ సామగ్రి విక్రయానికి యూఎస్​ ఆమోదం
author img

By

Published : Dec 4, 2020, 4:06 PM IST

భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య, రక్షణ సహకారంలో భాగంగా కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. తాజాగా భారత్​కు సీ-130 జే సూపర్​ హెర్క్యులస్​ మిలిటరీ యుద్ధ విమానాల అదనపు పరికరాలు, విడి భాగాలను భారత్​కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వీటి విలువ సుమారు 90 మిలియన్​ డాలర్లు(భారత కరెన్సీలో రూ.663 కోట్లకుపైనే).

ఈ సామగ్రిలో విమాన వినియోగ వస్తువులు, మరమ్మతు/ విడి భాగాలు, అడ్వాన్స్​డ్​ రాడార్​ వార్నింగ్​ రిసీవర్​ షిప్​సెట్​, రాత్రివేళలో వినియోగించే 10 తేలికపాటి బైనాక్యులర్స్​, నైట్​ విజన్​ గాగుల్స్​, జీపీఎస్​, ఎలక్ట్రానిక్​ యుద్ధ పరికరాలు ఇతరత్రా ఉన్నాయి.

''ప్రతిపాదిత అమ్మకం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతకు తోడ్పడుతుంది. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.''

- అమెరికా రక్షణ విభాగం

భారత వాయుసేన, సైనిక, నౌకాదళ రవాణా వ్యవస్థకు మరింత శక్తిని చేకూర్చే విమానాల తయారీలో.. అమెరికా సహకారం ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచేలా ఉంటుందని పేర్కొంది పెంటగాన్. ఈ విమానాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లోనే కాక ప్రాంతీయ విపత్తు సహాయక చర్యల్లోనూ కీలకంగా మారనున్నాయి. ఇండో పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాల్లో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక ప్రగతి సాధించడంలో ఉపయోగపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.