ETV Bharat / international

భారత్​కు మరోసారి అమెరికా భారీ సాయం - కరోనా రెండో దశ భారత్ అమెరికా

కరోనా నేపథ్యంలో భారత్​కు అమెరికా మరోసారి తన సాయాన్ని ప్రకటించింది. 41 మిలియన్​ డాలర్లను అందించనున్నట్లు చెప్పింది. అమెరికా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు.. ఇప్పుడు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్​ఏఐడీ) తెలిపింది.

us announces aid to india,
భారత్​కు మరోసారి అమెరికా భారీ సాయం
author img

By

Published : Jun 29, 2021, 11:59 AM IST

Updated : Jun 29, 2021, 12:26 PM IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో.. ఇబ్బందులు పడుతున్న భారత్‌కు అమెరికా మరోసారి సాయం ప్రకటించింది. భవిష్యత్​లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి.. భారత్‌కు 41 మిలియన్ అమెరికన్‌ డాలర్లు సాయం చేయనున్నట్లు పేర్కొంది. ఈ 41 మిలియన్లతో కలిపి భారత్‌కు అందే సాయం 200మిలియన్‌ అమెరికన్ డాలర్లు దాటుతుందని అగ్రరాజ్యం తెలిపింది. ఏప్రిల్‌, మేలో రోజుకు.. 3 లక్షల కొవిడ్‌ కేసులు నమోదుకావడం వల్ల ఆక్సిజన్‌ సహా పడకల కొరతతో భారత్‌ తీవ్ర ఇబ్బందులు పడింది. అమెరికా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు.. ఇప్పుడు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్​ఏఐడీ) తెలిపింది. భారత్‌లో కొవిడ్ పరీక్షలు, కొవిడ్‌ సంబంధిత మానసిక సమస్యలు, వైద్య సేవలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కల్పనకు అమెరికా సాయం అందిస్తుందని యూఎస్​ఏఐడీ ప్రకటించింది. అదనపు నిధుల ద్వారా ఆరోగ్య సేవల వ్యవస్థ, ఆరోగ్య ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వ్యాక్సినేషన్‌ వంటి కార్యక్రమాలకు సాయం చేయనున్నట్లు వివరించింది.

మరింత సాయం కావాలి..

అంతకుముందు.. భారత్‌కు మరింత సాయం అందించాలని బైడెన్‌ యంత్రాంగాన్ని అమెరికా అగ్రశ్రేణి ప్రజాప్రతినిథులు కోరారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, క్రయోజెనిక్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటైనర్లు సహా అన్ని రకాల వైద్య పరికరాలను భారత్‌కు అదనంగా అందించాలని.. అమెరికా ప్రతినిథుల సభలో బ్రాడ్‌ షెర్మన్‌, స్టీవ్‌ చాబాట్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. కొవిడ్‌ కష్టకాలంలో భారత ప్రజలకు అమెరికా అండగా నిలవాలని వారు కోరారు. అమెరికన్ కాంగ్రెస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ గ్రెగరీ మీక్స్‌...ఈ తీర్మానాన్ని సమర్థించారు. బైడెన్‌ యంత్రాంగం ఈ విషయంలో స్పందించాలని మీక్స్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండేవరకూ మనం సురక్షితంగా ఉండలేమన్న విషయాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.

ఇదీ చదవండి : అమెరికా, రష్యాలతో మైత్రిపై భారత్‌ ఆచితూచి అడుగులు!

Last Updated : Jun 29, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.