ETV Bharat / international

ఇరాన్​పై ఆంక్షలు మరింత కఠినతరం

ఇరాన్​పై అగ్రరాజ్యం అమెరికా మరోమారు ఆంక్షల కొరడా ఝుళిపించింది. జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో ఎవరూ ఇరాన్​తో సంబంధాలు పెట్టుకోకుండా ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేశారు. ఇనుము, ఉక్కులపై ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు.

author img

By

Published : Jan 11, 2020, 4:38 AM IST

Updated : Jan 11, 2020, 7:45 AM IST

US announces new sanctions on Iran after missile strikes
తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరాన్​పై అమెరికా నూతన ఆంక్షలు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్​పై నూతన ఆంక్షలు విధించింది. ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడమే ఇందుకు కారణం.

అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో ఇరాన్​పై విధించిన ఈ నూతన ఆంక్షల గురించి ప్రకటించారు. జనరల్​ సులేమానీని హతమార్చినందుకు ప్రతీకారంగా యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడిచేయడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడికి కారణమైన, పశ్చిమాసియాను అస్థిరపరిచే కార్యకలాపాలకు పాల్పడుతున్న 8 మంది ఇరాన్​ అత్యున్నత అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

నిషేధాజ్ఞలు

ఇరాన్​తో జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో ఎవరూ సంబంధాలు ఏర్పరుచుకోకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారని అమెరికా ఖజానా విభాగ కార్యదర్శి స్టీవెన్​ తెలిపారు. ఉక్కు, ఇనుము తదితర రంగాలకు సంబంధించి విడిగా ఆంక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.​ ఈ చర్యల ద్వారా ఇరాన్​కు అందిస్తున్న బిలియన్ల డాలర్ల సహాయాన్ని తగ్గిస్తున్నామని ఆయన వెల్లడించారు.

తీవ్ర ఉద్రిక్తతలు

జనరల్ సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసింది. అయితే తదుపరి పరిణామాల్లో ఉద్రిక్తతలు కొంత తగ్గినా... పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

ఇదీ చూడండి: బ్రిటన్ రాజకుటుంబంలో సంక్షోభం.. కెనడాకు మేఘన్!

Last Updated : Jan 11, 2020, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.