ETV Bharat / international

విమానాల సంఖ్య రెట్టింపునకు అమెరికా-చైనా అంగీకారం - అమెరికా చైనా

అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న విమానాల సంఖ్య రెట్టింపు చేసేందుకు రెండు దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి. పస్తుతం చెరో నాలుగు విమాన సేవలు అందుబాటులో ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 8కి చేరనుంది.

US and China agree to double airline flights between them
విమానాల సంఖ్య రెట్టింపునకు అమెరికా-చైనా అంగీకారం
author img

By

Published : Aug 19, 2020, 8:22 AM IST

అమెరికా-చైనాలు విమాన సర్వీసుల సంఖ్యను రెట్టింపు చేసుకునేందుకు పరస్పర అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం వారానికి రెండు దేశాలు చెరో నాలుగు విమానాలు నడుపుతుండగా.. తాజా అంగీకారంతో ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరనుంది. సెప్టెంబరు 4 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు అమెరికా రవాణా శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ నిర్ణయంతో కరోనా నేపథ్యంలో పర్యాటక ఆంక్షల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వైరస్​ వ్యాప్తికి ముందు జనవరిలో రెండు దేశాల మధ్య వారానికి 300విమానాలు నడిచేవి. ఆ తర్వాత విమాన సర్వీసుల రద్దుతో ఆ సంఖ్య భారీగా తగ్గింది.

ఇదీ చూడండి: సైనిక తిరుగుబాటుతో మాలి అధ్యక్షుడి రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.