ETV Bharat / international

భారత్​కు కొనసాగుతున్న అమెరికా సాయం - india corona cases

కరోనాపై పోరులో భాగంగా.. భారత్​కు అమెరికా మద్దతు కొనసాగుతోంది. ఇప్పటివరకూ 'యూఎస్ ఎయిడ్' పేరిట 100 మినియన్ డాలర్ల సహాయం అందించినట్లు అమెరికా వెల్లడించింది.

America aid to India
భారత్-అమెరికా
author img

By

Published : May 7, 2021, 11:35 AM IST

కరోనాపై పోరులో భారత్‌కు.. అమెరికా సహకారం కొనసాగుతోంది. 'యూఎస్ ఎయిడ్‌' పేరిట భారత్‌కు 100 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్న అమెరికా మొత్తం ఆరు విమానాల్లో వైద్య అత్యవసరాలు పంపింది.

ఇప్పటివరకూ మొత్తం 1.25 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు పంపినట్లు అమెరికా వెల్లడించింది. 15 వందల ఆక్సిజన్ సిలిండర్లు, 550 మొబైల్ ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు, 10లక్షల ర్యాపిడ్ కిట్లు పంపింది. 25లక్షల ఎన్-95 మాస్కులు.. 210 పల్స్ ఆక్సీమీటర్లు పంపినట్లు వివరించింది. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా.. భారత్‌కు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు.. నెదర్లాండ్స్‌, యూఏఈ, స్విడ్జర్లాండ్‌ నుంచి కూడా భారత్‌కు వైద్య పరికరాలు, ఔషధాలు విమానాల్లో వచ్చాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన పలు ఏజెన్సీలు కూడా వైద్యపరికరాలను భారత్‌కు అందిస్తున్నాయి. ఇప్పటివరకూ.. 10వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, కోటికిపైగా మాస్క్‌లు పంపాయి. వాటిని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది అవసరమైన రాష్ట్రాలకు పంపుతున్నాయి.

ఇవీ చదవండి: బైడెన్​కు​ మోదీ ఫోన్​- కొవిడ్​పై చర్చ

అమెరికా నుంచి 1.25లక్షల రెమిడెసివిర్ వయల్స్​

విదేశీ సాయమంతా కేంద్ర సంస్థలకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.