ETV Bharat / international

భారత్​కు యూనిసెఫ్​ 3,000 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు

కొవిడ్​పై పోరులో భాగంగా భారత్​కు వైద్య పరికరాలు సాయం చేసింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్. 3000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 500 నాసల్ కన్నులాస్, 85 ఆర్​టీపీసీఆర్​ టెస్టు యంత్రాలు భారత్​కు పంపినట్లు తెలిపింది. మరోవైపు థాయ్​లాండ్​ పంపిన వైద్య పరికరాలు శనివారం దిల్లీకి చేరుకున్నాయి.

unicef
యునిసెఫ్
author img

By

Published : May 1, 2021, 12:49 PM IST

కొవిడ్​ కట్టడిలో భాగంగా భారత్​కు సహకరించింది ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం యునిసెఫ్. 3,000 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను భారత్​కు పంపించింది. వ్యాక్సినేషన్​ ప్రక్రియలోను భారత్​కు అండగా ఉంటామని పేర్కొంది ఐరాస అనుబంధ సంస్థ.

దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రలోని ఆసుపత్రుల కోసం 25 ఆక్సిజన్ ఉత్పత్పి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐరాస ప్రతినిధి ఫరాన్ హక్ తెలిపారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసేందుకు ఐరాస సహకరిస్తుందని అన్నారు.

దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ అందేలా భారత్​కు సాయం చేయనున్నట్లు యునిసెఫ్ తమ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వ్యాక్సిన్లను సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. 3,000 ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లతో పాటు 500 నాసల్ కన్నులాస్(ముక్కుకు అమర్చే పరికరాలు), 85 ఆర్​టీపీసీఆర్​ టెస్టు యంత్రాలు భారత్​కు పంపినట్లు పేర్కొంది.

థాయ్​లాండ్​ సహకారం..

thailand
వైద్య పరికరాలు పంపిన థాయ్​లాండ్

మహమ్మారితో పోరాటంలో భాగంగా.. థాయ్​లాండ్​ పంపిన వైద్య పరికరాలు భారత్​కు చేరుకున్నాయి. శనివారం ఈ పరికరాలు దిల్లీకి చేరుకున్నట్లు భారత్​ స్పష్టం చేసింది.

thailand
భారత్​కు చేరిన థాయ్​లాండ్ విమానం

ఇదీ చదవండి:రాష్ట్రాలకు రూ. 8,873 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.