ETV Bharat / international

మిసైల్ ప్రయోగం- ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు! - ఉత్తర కొరియా

ఇటీవల క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియాపై ఆంక్షల పునరుద్ధరణ చేయాలని తీర్మానించింది ఐక్యరాజ్య భద్రతా మండలి. విశ్వసనీయ, స్వతంత్ర దర్యాప్తు చేయాలని నిపుణులను ఆదేశించింది.

UN renews mandate of North Korea experts, asks missile probe
మిసైల్ ప్రయోగం- ఉత్తర కొరియాపై ఆంక్షలు!
author img

By

Published : Mar 27, 2021, 10:43 AM IST

నిషేధిత బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే యూఎన్ నిపుణుల ఆదేశాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఐక్యరాజ్య భద్రతా మండలి. ఈ మేరకు అమెరికా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు శుక్రవారం ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికలకు సమాధానంగా గురువారం రెండు క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా. ఇరు దేశాల మధ్య అణు చర్చలు నిలిచిపోయిన వేళ.. బైడెన్​ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రయోగాలు చేపట్టింది కిమ్​ సర్కారు.

నిపుణుల ఆదేశాలను 2022 ఏప్రిల్ 30 వరకు పొడిగించింది తాజా తీర్మానం. విశ్వసనీయ, వాస్తవాధారిత, స్వంతంత్ర మదింపు, విశ్లేషణ, సూచనలు చేయాలని పేర్కొంది.

ఇదీ చూడండి: జో బైడెన్​ సర్కార్​కు 'కిమ్' తొలి హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.