కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు.. బహిరంగంగానే టీకా తీసుకునేందుకు తాను సిద్ధమని ప్రకటించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. అది తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు.
టీకా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు గుటెరస్. టీకాను తీసుకుంటే వైరస్‌ను వ్యాప్తి చేయమని.. ఫలితంగా ఇది యావత్ ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడం సేవతో సమానమన్నారు.
ఇదీ చూడండి:- 'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'
'టీకా జాతీయవాదం పెరుగుతోంది...'
ప్రపంచవ్యాప్తంగా 'టీకా జాతీయవాదం' వేగంగా పెరుగుతోందని హెచ్చరించారు గుటెరస్. ఫలితంగా.. అభివృద్ధి చెందిన దేశాల వ్యాక్సిన్ సన్నద్ధతను పేద దేశాలు చూస్తూ ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. తమకు టీకా ఎప్పుడు అందుతుందా అని వారు ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉండాలని పునరుద్ఘాటించారు గుటెరస్. ముఖ్యంగా అఫ్రికాకు అందించాలని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన 'కోవాక్స్' కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆఫ్రికాలోని పేద దేశాలకు టీకాలు అందించడానికి ఇదే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:- ఐరాస చీఫ్‌కు బైడెన్ ఫోన్- కొవిడ్‌పై చర్చ