ETV Bharat / international

భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస - india china news live

భారత్​, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

UN chief expresses concern about reports of violence
భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస
author img

By

Published : Jun 17, 2020, 1:08 AM IST

తూర్పు లద్దాఖ్​లోని గాల్వాన్​​ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​, చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. ఉద్రిక్తతలు చెలరేగుతున్న పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి ఎరి కనెకో వివరాలు వెల్లడించారు.

" భారత్​, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి హింస చెలరేగి, మరణాలు సంభవించినట్లు వచ్చిన నివేదికలతో ఆందోళన చెందాం. ఇరు వైపులా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు మాకు సానుకూల సమాచారం అందింది."

- ఎరి కనెకో, ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి.

భారత్​, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు భారత్​ వర్గాలు భావిస్తున్నాయి. ఆ సంఖ్య 43గా అంచనా వేశాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.