ETV Bharat / international

'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు' - కరోనా వైరస్​

కరోనా వైరస్​పై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ విమర్శించారు. సొంత విధానాలతో వైరస్​పై విజయం సాధించలేమని.. అందరం కలిసిగట్టుగానే పోరాడాలని స్పష్ట చేశారు.

UN chief criticises lack of global cooperation on COVID-19
'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు'
author img

By

Published : Jun 24, 2020, 2:11 PM IST

Updated : Jun 24, 2020, 2:20 PM IST

కరోనాపై పోరులో ప్రపంచ దేశాల వైఖరిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శ ఆంటోనియో గుటెరస్​ అసహనం వ్యక్తం చేశారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా సమన్వయం లేదని విమర్శించారు. వైరస్​ను జయించడానికి సొంతంగా చేపట్టే విధానాలు పనికిరావని హెచ్చరించిన గుటెరస్​.. అందరూ కలిసిగట్టుగా ఉండాలని సూచించారు.

సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల కరోనా సంక్షోభం మరింత ముదురుతోందని.. అంతర్జాతీయంగా సమన్వయం పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమని అభిప్రాయపడ్డారు ఐరాస ప్రధాన కార్యదర్శి. అన్ని దేశాలు ఒకే ధాటిపైకి వచ్చి తమ శక్తి సామర్థ్యాలను కలిసిగట్టుగా ఉపయోగించుకోవాలని.. సమన్వయంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అందరికి చికిత్స, వ్యాక్సిన్​ అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అప్పుడే వైరస్​ను ఓడించగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలన్నారు.

వైరస్​ 2.0పై నివేదికలు అందుతున్నప్పటికీ.. కరోనా కట్టడిపై ప్రపంచ దేశాల తీరు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : Jun 24, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.