రెండు కరోనా టీకాలతో పిల్లలకు వైరస్ నుంచి రక్షణ కల్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మోడెర్నాతో పాటు ప్రోటీన్- ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కోతి పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్దరణ అయినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించారు.
పిల్లల్లో వైరస్ వ్యాప్తిని నివారించడానికి టీకాలు కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టీకాల ప్రయోగాలు.. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగాయని.. అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు ప్రయోగాలు కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. రెండున్నర నెలల వయసున్న కోతి పిల్లలను రెండు గ్రూపులుగా విడదీసి.. టీకాలను ఇవ్వగా.. నాలుగు వారాల తర్వాత రోగనిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు.
ప్రతి జంతువుకు ప్రీక్లినికల్ మోడెర్నా mRNA టీకా లేదా లేదా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ అందించారు. mRNA టీకా వైరస్ ఉపరితల ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సూచనలను అందిస్తుంది.
వ్యాక్సిన్.. స్పైక్ ప్రోటీన్‌న్లను సృష్టించమని కణాలను నిర్దేశిస్తుంది. ఇది వైరస్.. మానవ శరీరంలోని అన్ని భాగాలకు ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. దీంతో రోగనిరోధక కణాలు ప్రోటీన్‌ను గుర్తించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి.
ఎన్ఐఏఐడీ టీకాలోనే స్పైక్ ప్రోటీన్ ఉంటుంది. దానిని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి అదే పరిమాణంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
"రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి అవుతాయి. అయితే వ్యాక్సిన్లు.. టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇది పిల్లల్లో భద్రతకు హాని కలిగిస్తుంది. అలాగే యాంటీబాడీలు ఎదుర్కొని.. చిన్నపిల్లల్లో టీకా అభివృద్ధికి ఆటంకం కలిస్తాయి. కాబట్టి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది"
- పరిశోధకులు
అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇచ్చినట్లయితే.. శక్తిమంతమైన ప్రతిరోధకాల వయోజనుల్లో పెరిగిన స్థాయితో పోల్చవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైన అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ క్రిస్టినా డి పారిస్ అన్నారు. మోడెర్నా టీకాతో, నిర్దిష్ట బలమైన టీ-కణాలు ప్రతిస్పందిస్తాయని.. ఇవి వ్యాధి తీవ్రతను ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలు.. పిల్లల్లో కరోనా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు.
ఇదీ చూడండి: షికాగోలో కాల్పులు.. నలుగురు మృతి