ETV Bharat / international

వీసాల రద్దుతో అమెరికా కంపెనీలకు అంత నష్టమా? - foreign-workers NEWS'

హెచ్‌1బీ, ఎల్‌1బీ వీసాల రద్దు వల్ల అమెరికా కంపెనీలు భారీ మొత్తంలో నష్టపోయినట్లు ఓ నివేదిక చెబుతోంది. ట్రంప్​ నిర్ణయం దేశంలోనీ ప్రైవేటు సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వెల్లడించింది. అలాగే విద్యార్థుల వీసాలకు సంబంధించి హోంలాండ్​ సెక్యూరిటీ విభాగం చేసిన ప్రతిపాదన భవిష్యత్​లో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు పాలిట శాపంగా మారింది.

Trump's executive order on visas for foreign workers cost USD 100B, claims think tank
వీసాల రద్దుతో అమెరికా కంపెనీలకు వచ్చిన నష్టం ఎంతంటే?
author img

By

Published : Oct 23, 2020, 2:58 PM IST

హెచ్‌1బీ, ఎల్‌1బీ వీసాలు రద్దు చేయడం వల్ల అమెరికాలోని కంపెనీలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రముఖ పరిశోధనా సంస్థ బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను రాకుండా అడ్డుకోడవం వల్ల ప్రైవేటు సంస్థలు దాదాపు వంద బిలియన్​ డాలర్లు నష్టపోయినట్లు వెల్లడించింది.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ ప్రొఫెసర్, భారతీయ- అమెరికన్ పృథ్వీరాజ్ చౌదరి, బ్రూకింగ్స్​ సంస్థ నుంచి డానీ బహస్ర్​, పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బ్రిట్టా గ్లెన్నన్​ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు.

హెచ్‌1బీ, ఎల్‌1బీ వీసాలను రద్దు చేస్తూ జూన్ ​22న కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు ట్రంప్​. ఈ నిర్ణయం భారత ఐటీ నిపుణుల డాలర్​ డ్రీమ్స్​ను చెదరగొట్టింది. ఆ దేశంలోని దాదాపు 500కంపెనీలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

దాదాపు 2లక్షల మంది విదేశీ కార్మికులు, వారిపై ఆధారపడ్డ వారిని ట్రంప్​ కార్యనిర్వాహక ఉత్తర్వలు అడ్డుకున్నట్లు బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ప్రతిభావంతులైన వలసదారుల వల్ల లాభాలు, సృజనాత్మకత, పెట్టుబడులు పెరుగుతాయనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని వివరించింది.

మరో కీలక ప్రతిపాదన

ఇదిలా ఉంటే అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ కౌన్సిల్​లో హోంలాండ్​ సెక్యూరిటీ విభాగం మరో కీలక ప్రతిపాదన చేసింది. విదేశీ విద్యార్థుల ప్రవేశ కాలాలను తగ్గించడం, ఎక్స్చేంజ్​ విజిటర్స్​ కు సంబంధించిను ఈ నూతన ప్రతిపాదనలు పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణల్లో అమెరికా స్థాయిని తగ్గించే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజా ప్రతిపాదన అమెరికన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలే కాకుండా యూఎస్​లో ఉన్నత విద్యను కోరుకునే విదేశీ విద్యార్థులను ప్రతికూల నిర్ణయంగా మారునుంది.

"హోంలాండ్​ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదన విద్యలో ప్రపంచ సారథిగా ఉన్న అమెరికాకు నష్టం కలగజేస్తుంది. ఈ విధానాల వల్ల విద్యార్థులు వారి కోర్సులను పూర్తి చేయడం కష్టం అవుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఇతర దేశాల్లో చదువుకోవడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది.”

-బెత్ వెర్లిన్, అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.