ETV Bharat / international

ట్రంప్ X బైడెన్: కరోనా విషయంలో అబద్ధాలు ఎవరివి?

కరోనా అంశంపై అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​ మధ్య మాటలయుద్ధం జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా క్లీవ్​లాండ్​లో జరిగిన తొలి సంవాదం రసవత్తరంగా సాగింది. కరోనాపై అధ్యక్షుడికి కనీస అవగాహన లేదని బైడెన్​ విమర్శించగా.. తమ కృషి వల్లనే దేశంలో మరణాల సంఖ్య తగ్గిందని ట్రంప్ స్పష్టం చేశారు.

trumpxbiden
ట్రంప్ X బైడెన్
author img

By

Published : Sep 30, 2020, 7:59 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి సంవాదంలో కరోనా విపత్తుపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య చర్చ రసవత్తరంగా సాగింది. కరోనా వ్యాక్సిన్​ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని ట్రంప్ తెలిపారు. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామని అన్నారు. నవంబర్​లోనే వ్యాక్సిన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్​ తప్పుపట్టారు. అధ్యక్షుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్​ ఈ ఏడాది చివరి నాటికి వచ్చినా.. దానిని పంపిణీ చేసేందుకు కొన్ని నెలలు పడుతుందని బైడెన్​ అన్నారు.

నిర్లక్ష్యం చేశారంటూ..

కరోనా విషయంలో మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఫిబ్రవరిలోనే సమాచారం వచ్చినా సరైన చర్యలు చేపట్టలేదని, ప్రజారోగ్యం కన్నా ఆర్థిక వ్యవహారాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ వైఫల్యం కారణంగా 2 లక్షల మంది అమెరికన్ ప్రజలు కొవిడ్‌తో మరణించారని అన్నారు. 70 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారని, ఈ పరిణామాలల్లో వాళ్లు ఆరోగ్య రక్షణకు ఎలాంటి హామి ఇవ్వగలరని ప్రశ్నించారు.

కరోనా విషయంలో అధ్యక్షుడు దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సొంతంగా కూడా జాగ్రత్తలు పాటించలేదని విమర్శలు చేశారు. తాము సంయమనం పాటించామని, ప్రజల ఆరోగ్యం, సామాజిక దూరం పట్టించుకోకుండా ట్రంప్ వ్యవహరించారని మండిపడ్డారు.

ఖండించిన ట్రంప్

బైడెన్​ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. కరోనా వైరస్​ చైనాలో పుట్టిందని, అమెరికాకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. చైనా, రష్యా, భారత్​లో ఎంతమంది చనిపోయారో ప్రపంచానికి తెలియదన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించినట్లు, పత్రికల్లో దుష్ప్రచారాం వల్లే తనకు చెడ్డపేరు వస్తోందని అన్నారు.

కరోనాను ఎదుర్కోవటంలో నా పనితీరుకు ఫౌచీ ప్రశంసలే నిదర్శమని ట్రంప్ అన్నారు. తాము సరైన చర్యలు తీసుకోకపోయి ఉంటే 20 లక్షల మందికిపైగా చనిపోయేవారని ట్రంప్ తెలిపారు. తాను చెప్పే అంశాలు ప్రజలందరికీ చేరేందుకే భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే పాఠశాలలు ప్రారంభించామని ట్రంప్ వెల్లడించారు.

బైడెన్​పై వ్యంగ్యాస్త్రాలు..

బైడెన్​ అమెరికాను మూసేయాలని కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు దేశాన్ని షట్​డౌన్​లో ఉంచాలన్నది వారి ఆలోచన కావచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైడెన్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బైడెన్​ ఎప్పుడూ ఎదుటివారితో 200 అడుగుల దూరం నుంచే మాట్లాడుతారని, తాను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మాస్కు ఆయనేనని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: ట్రంప్ X బైడెన్​: ఆరోగ్య విధానంపై ప్రణాళిక ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.