అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన, నిరంతర బంధాన్ని సూచిస్తుందని పేర్కొంది శ్వేతసౌధం. ఈ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనగా అభివర్ణించింది.
ఈనెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు ట్రంప్. మెలానియా ట్రంప్‌తో కలిసి అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీని సందర్శించనున్నారు. ట్రంప్‌తో పాటు 12 మంది ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత్‌కు రానుంది.
మతపరమైన స్వేచ్ఛపై...
భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో మతపరమైన స్వేచ్ఛపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చిస్తారని పేర్కొంది శ్వేతసౌధం. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను అమెరికా గౌరవిస్తుందని తెలిపింది.
పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర జాబితాలపై మోదీతో ట్రంప్ మాట్లాడే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు శ్వేతసౌధం అధికారి ఒకరు ఈ విధంగా సమాధానమిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీల అంశంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: 'మోటేరా' విశేషాలు ఎన్నో.. మరెన్నో!