ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను మరోసారి హెచ్చరించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాతో వైరం కారణంగా కిమ్ సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. మరో కీలక క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఇలా స్పందించారు.
"కిమ్ జోంగ్ ఉన్ చాలా తెలివైన వాడు.. కానీ అతను శత్రుత్వంతో వ్యవహరిస్తే చాలా కోల్పోవాల్సి వస్తుంది. నిజానికి సర్వస్వం." -ట్రంప్ ట్వీట్.
ట్రంప్ ట్వీట్
మరో క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా శనివారం చేసిన ప్రకటన తనను ఆశ్చర్యానికి గురిచేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే కిమ్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.