ETV Bharat / international

చైనా నుంచి ట్రంప్ కోరుకునేది అదే: పాంపియో

author img

By

Published : Sep 24, 2020, 12:51 PM IST

చైనాతో న్యాయమైన సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. చైనాతో ప్రతికోణంలోనూ సమాన స్థాయి సంబంధాలు నెలకొనాలని ఆశించారు. ట్రంప్ కోరుకునేది అదేనని వివరించారు.

US-POMPEO-CHINA
పాంపియో

చైనాతో న్యాయమైన, సమతౌల్య బంధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పష్టం చేశారు. అమెరికా, చైనా మధ్య బెదిరింపులకు తావులేని సమాన స్థాయి సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు.

సెనేటర్​ రోజర్​ రాత్​తో బుధవారం జరిగిన సమావేశంలో చైనా సంబంధాలపై పాంపియో మాట్లాడారు. తమ వద్దనున్న అవకాశాలు ఉపయోగించుకోవాలని, చైనాతో ప్రతి కోణంలోనూ మంచి పరస్పర సంబంధాలను ఆశించాలని పేర్కొన్నారు. చైనా నుంచి ట్రంప్ అదే కోరుకుంటున్నారని వివరించారు.

"కానీ, చైనా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 1970లలో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్​ చైనాతో మంచి సంబంధాలు నెరిపారు. కానీ, అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మేధో సంపత్తి చౌర్యంతో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ట్రంప్​ కన్నా ముందు చైనాతో వాణిజ్యం అసమానంగా ఉంది. ఇప్పటికీ చైనా అభివృద్ధి చెందుతున్న దేశమని నమ్మిస్తూ ప్రయోజనాలు పొందుతోంది. దీన్ని మార్చేందుకు ట్రంప్ అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు."

- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

వాణిజ్య యుద్ధం..

అమెరికా, చైనా మధ్య 2018 నుంచి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ట్రంప్. రెండు దేశాల మధ్య 2017లో ఏర్పడిన 375 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును పూడ్చాలని డిమాండ్ చేశారు. ఫలితంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి.

దీనికి అదనంగా కరోనా మహమ్మారితో విభేదాలు తారస్థాయికి చేరాయి. మహమ్మారి విజృంభణకు బీజింగ్​ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వస్తున్నారు ట్రంప్. కొవిడ్​-19ను చైనా వైరస్​ అంటూ సంభోదిస్తున్నారు. అయితే, చైనా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ఇదీ చూడండి: 'అందుకే భారత్​తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.