ETV Bharat / international

'జాకబ్​' నిరసనల విధ్వంసం డెమొక్రట్ల పనే: ట్రంప్​ - Trump wades into racial tensions in Kenosha

నల్ల జాతీయుడిపై పోలీసుల కాల్పులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విస్కాన్సిన్​, కెనోషాలో పర్యటించారు ట్రంప్​. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. నిరసనల్లో ధ్వంసమైన దుకాణాలు, ఇళ్ల యజమానులతో మాట్లాడారు ట్రంప్​. కెనోషా పునర్నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు​. ఈ విధ్వంసాన్ని డెమొక్రట్లే ప్రారంభించారని ఆరోపించారు.

Trump wades into racial tensions in Kenosha
'జాకబ్​' నిరసనల విధ్వంసం డెమొక్రట్ల పనే: ట్రంప్​
author img

By

Published : Sep 2, 2020, 5:30 AM IST

నల్ల జాతీయుడు జాకబ్​ బ్లేక్​పై పోలీసుల కాల్పులతో హింసాత్మక ఘటనలు చెలరేగిన విస్కాన్సిన్​ రాష్ట్రం కెనోషాలో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అల్లర్లలో ధ్వంసమైన దుకాణాలు, ఇళ్లను సందర్శించి, యజమానులతో మాట్లాడారు. ఈ అల్లర్లు డెమొక్రటిక్​ నేతలే ప్రారంభించారని ఆరోపించారు ట్రంప్​.

ట్రంప్​ పర్యటనపై రాష్ట్ర, స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కెనోషాలో పర్యటించారు ట్రంప్​. స్థానిక​ డెమొక్రటిక్ పాలకులపై విమర్శలు గుప్పించారు. 'నేను ఇక్కడికి వచ్చేందుకు వారికి ఇష్టం లేదు. ఫెడరల్​ బలగాలను మోహరించేందుకు ఈ గవర్నర్లకు, మేయర్లకు ఇష్టం లేదు. బలగాలను పంపమని వారు అడగాలి. కానీ అలా చేయలేదు' అని పేర్కొన్నారు ట్రంప్​.

భారీ భద్రత..

ట్రంప్​ కాన్వాయ్​ వెళుతున్న క్రమంలో కొద్దరు మద్దతుదారులు అమెరికా జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు బ్లాక్​ లైవ్స్​ మ్యాటర్​ ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసు కమాండ్​ పోస్ట్​గా మార్చిన పాఠశాలను సందర్శించారు ట్రంప్​. భద్రత బలగాలను ప్రశంసించారు. అయితే.. హింసకాండకు అసలు కారణంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ట్రంప్​. బ్లేక్​ విషయాన్ని మొదటగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అతని తల్లిని కలవాలనుకున్నానని, కాని వారి కుటుంబం నిరాకరించినందున విరమించుకున్నట్లు చెప్పారు.

తన విమర్శల దాడిని కొనసాగిస్తూ.. విధ్వంసకాండను డెమొక్రటిక్​ పార్టీ, వారి అధ్యక్ష అభ్యర్థి జో బైడన్​కు ఆపాదించారు ట్రంప్​. ఈ గందరగోళ పరిస్థితులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.

పునర్నిర్మాణానికి సాయం..

సమాజ భద్రతపై కెనోషాలో నిర్వహించిన రౌండ్​టేబుల్​​ సమావేశానికి హాజరయ్యారు ట్రంప్​. హింసను కట్టడి చేసేందుకు కెనోషాకు వేగంగా నేషనల్​ గార్డ్స్​ను పంపేందుకు రాష్ట్ర అధికారులతో తమ పరిపాలన విభాగం సమన్వయమైనట్లు చెప్పారు. ఏ నగరానికైనా వేగంగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కెనోషా పునర్నిర్మాణానికి హామీ ఇచ్చారు ట్రంప్​. చిరు వ్యాపారాలకు 4 మిలియన్​ డాలర్లు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా భద్రతకు 42 మిలియన్​ డాలర్లు, కెనోషా పోలీసు విభాగానికి 1 మిలియన్​ డాలర్లు అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'జాకబ్' నిరసనల్లో కాల్పులు- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.