ETV Bharat / international

అమెరికాను రక్షించుకుంటామని ట్రంప్​ శపథం - Trump us protests

అమెరికా పోలీసుల దాష్టీకానికి బలైన నల్లజాతీయుడు ఫ్లాయిడ్​కు మద్దతుగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే ఆందోళనకారుల చర్యలతో వాషింగ్టన్​లో దగ్ధమైన పురాతన చర్చిని సందర్శించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.

Trump visits historic church that was set on fire by protestors
నిరసనల్లో దగ్ధమైన పురాతన చర్చిని సందర్శించిన ట్రంప్​
author img

By

Published : Jun 2, 2020, 4:37 PM IST

నిరసనల్లో దగ్ధమైన పురాతన చర్చిని సందర్శించిన ట్రంప్​

అమెరికాలో ఆందోళనకారుల హింసాత్మక నిరసనల్లో పాక్షికంగా ధ్వంసమైన పురాతన చర్చిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సందర్శించారు. ఫ్లాయిడ్​ మృతికి న్యాయం జరగాలంటూ డిమాండ్​ చేస్తూ.. వాషింగ్టన్​లోని సెయింట్​ జాన్స్​ చర్చికి ఆదివారం రాత్రి నిప్పంటించారు నిరసనకారులు.

ఈ నేపథ్యంలో చేతిలో బైబిల్​ పట్టుకొని చర్చికి వచ్చిన ట్రంప్​.. ప్రపంచంలోనే గొప్పదేశాన్ని సురక్షితంగా ఉంచుతామని ఈ సందర్భంగా శపథం చేశారు. ఆయనతో పాటు అమెరికా అటర్నీ జనరల్​ విలియం బార్​, చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ మార్క్​ మెడోస్​ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్రరాజ్య పోలీసుల కారణంగా ఆఫ్రికన్​ అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మరణించిన తీరుపై అమెరికాలో కొద్దిరోజులుగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఫ్లాయిడ్​ మృతితో దశాబ్దాల కాలంలో అగ్రరాజ్యంలో ఎన్నడూ లేనంత నిరసనలు వెల్లువెత్తాయి. సుమారు 140 నగరాలకు ఈ ఆందోళనలు వ్యాపించాయి. ఇప్పటి వరకు 4 వేల మందికిపైగా అరెస్టు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి:వేలాదిమంది సాయుధ సైనికుల్ని దించుతా: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.