ETV Bharat / international

ఇరాన్​పై యూఎన్​​ ఆంక్షల పునరుద్ధరణకు అమెరికా డిమాండ్​ - America on Iran

అమెరికా-ఇరాన్​ల మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. ఇరాన్​పై సడలించిన యూఎన్ ఆంక్షలన్నింటనీ పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తోంది అమెరికా. 2015 ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో ఇరాన్​ విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే.. అమెరికా డిమాండ్​ను తప్పుబడుతున్నాయి ఐరాస భద్రతా మండలిలోని ఇతర సభ్య దేశాలు.

US demands restoration of UN sanctions against Iran
ఇరాన్​పై యూఎన్​​ ఆంక్షల పునరుద్ధరణకు అమెరికా డిమాండ్​!
author img

By

Published : Aug 20, 2020, 12:40 PM IST

ఇరాన్​పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలన్నీ తిరిగి అమలు చేయాలని అమెరికా డిమాండ్​ చేయనున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. టెహ్రాన్​కు వ్యతిరేకంగా ఆయుధ ఆంక్షలు విస్తరించటంలో అమెరికా విఫలమైన క్రమంలో ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్​పై తక్షణం యూఎన్​ ఆంక్షలు పునరుద్ధరించాలని ట్రంప్​ పరిపాలన విభాగం పట్టుబడుతున్న నేపథ్యంలో వివాదానికి దారితీసింది. స్నాప్​బ్యాక్​ విధానం ద్వారా ఇరాన్​పై యూఎన్​ ఆంక్షలను పునరుద్ధరించాలని అమెరికా చూస్తోంది. ఈ విధానాన్ని 2015 అణ్వాయుధ ఒప్పందంలో ఆమోదించారు. అయితే..అమెరికా పిలుపును ఐరాస భద్రతా మండలిలోని ఇతర సభ్య దేశాలు తోసిపుచ్చే అవకాశం ఉంది.

2015 అణు ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో ఇరాన్​ విఫలమైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి మైక్​ పాంపియో గురవారం న్యూయార్క్​లో జరిగే ఐరాస సమావేశంలో.. ఇరాన్​పై ఆంక్షలు పునరుద్ధరించాలనే అమెరికా డిమాండ్​ను తెలియజేస్తారు. ఇది తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇరాన్​ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండబోవు. నేను ఎన్నికల్లో గెలిచిన నెల రోజల్లోనే ఇరాన్​ మా దగ్గరకు వస్తుంది. మాతో ఒప్పందం చేసుకునేందుకు అభ్యర్థిస్తుంది.

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికాకు ఎదురుదెబ్బ..

ఇరాన్​పై ఆయుధాల ఆంక్షలను పొడిగించటంపై గత వారం ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనా, రష్యాలు అమెరికాను వ్యతిరేకించగా.. 11 ఇతర దేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. ఒక్కరు మాత్రమే అమెరికాకు మద్దతుగా నిలిచారు. దీంతో వివాదాస్పద దౌత్యపరమైన చర్యలకు తెరతీయనున్నట్లు పాంపియో, ట్రంప్​ తమలోని ఆలోచనలను సూత్రప్రాయంగా వెల్లడించారు.

డిమాండ్​ చేసే హక్కులేదు..

ఇరాన్​పై ఆంక్షలను పునరుద్ధరించాలని డిమాండ్​ చేసే హక్కు అమెరికాకు లేదని పేర్కొన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఇరాన్​పై ట్రంప్​ పరిపాలన విభాగం రాజకీయంగా ప్రేరేపిత ప్రచారాన్ని ప్రారంభించిందని ఆరోపించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్​రోవ్​. ఇస్లామిక్​ రిపబ్లిక్​పై శాశ్వత ఆయుధాల నిషేధాన్ని విధించే అమెరికా ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: మెరికా-ఇరాన్​ 'శాంతి మంత్రం' ఎంత కాలమో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.