ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ నన్నే ఎందుకంటే? - corona news

అమెరికాలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. మొత్తం మృతుల సంఖ్య 70 వేలకు చేరొచ్చని అంచనా వేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే 22 లక్షల ప్రాణాలు పోయేవని నిపుణులు అంచనా వేయగా... తాము మాత్రం గొప్పగా పనిచేసి, భారీ ప్రాణనష్టాన్ని తగ్గించానని చెప్పుకొచ్చారు.

Trump: US coronavirus deaths could reach 70,000
వేల మంది చనిపోతుంటే అధ్యక్షుడిగా మళ్లీ మీరేనా?
author img

By

Published : Apr 28, 2020, 2:38 PM IST

మహమ్మారి కరోనా కారణంగా అమెరికాలో మృతుల సంఖ్య 70 వేల వరకు ఉండొచ్చని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అంచనా వేశారు. శ్వేతసౌధంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్​కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "వియత్నాం యుద్ధంలో మరణించిన సంఖ్య కంటే.. ఈ ఆరు వారాల్లో ఎక్కువ మంది అమెరికన్లు చనిపోయారు. అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యేందుకు మీరు అర్హులా?" అని ప్రశ్నించారు ఓ విలేకరి.

వియత్నాం యుద్ధంలో సుమారు 58 వేల మంది అమెరికా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

గొప్పపనే చేశా!

విలేకరి ప్రశ్నకు స్పందించిన డొనాల్డ్​.. తిరిగి తనను ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు. భౌతిక దూరం సహా ఇతర నిబంధనలు పాటించకుంటే కరోనాకు 22 లక్షల మంది బలయ్యేవారని నిపుణుల అంచనా వేశారని గుర్తుచేశారు. తాము మాత్రం సరైన చర్యలు చేపట్టి, ప్రాణనష్టాన్ని తగ్గించానని చెప్పారు.

''కరోనా మరణాలు 22 లక్షల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. మా లెక్క ప్రకారం ఆ సంఖ్య 60 నుంచి 70 వేలకే పరిమితం అవుతుంది. ఇది చాలా తక్కువ. నాకు తెలిసి మేం మంచి నిర్ణయాలే తీసుకున్నామని అనుకుంటున్నా. ముఖ్యంగా సరిహద్దును మూసివేయడం, చైనా వారిని రాకుండా నిషేధించడం వంటివి అతిపెద్ద నిర్ణయాలు.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

చివరగా.. తాము గొప్ప పనిచేశామని, ఒక వ్యక్తికి ఇది పెద్ద విషయమని వ్యాఖ్యానించారు ట్రంప్.

అమెరికా కరోనా మరణాల సంఖ్య 60 వేలు నమోదవ్వచ్చని ఈ నెల ప్రారంభంలో అంచనా వేశారు డొనాల్డ్​ ట్రంప్​. జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటికే 55 వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.