ETV Bharat / international

బాలీవుడ్​ సినిమాపై ట్రంప్​ ట్వీట్​​.. ఏమన్నారంటే? - shubh mangal zyada saavdhan movie

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మనసు బాలీవుడ్​పై పడింది. ఇటీవల విడుదలైన ఓ సినిమాపై ఆయన చేసిన ట్వీట్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ బాలీవుడ్​ చిత్రం ఏంటో తెలుసా?​

trump tweeted on bollywood movie shubh mangal zyada saavdhan and he said great..
బాలీవుడ్​పై సినిమా ట్రంప్​ ట్వీట్​​.. ఏం అన్నారంటే?
author img

By

Published : Feb 22, 2020, 12:14 PM IST

Updated : Mar 2, 2020, 4:07 AM IST

ఇటీవల విడుదలైన ఓ బాలీవుడ్‌ చిత్రంపై అమెరికా అధ్యక్షుడి దృష్టి పడింది. ఈ మేరకు ట్రంప్‌ సదరు బాలీవుడ్‌ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్‌ కూడా పెట్టారు. 'అంధాధున్‌' చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించిన సినిమా 'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌'. స్వలింగ సంపర్కుల (గే) మధ్య ఉండే ప్రేమాభిమానాలను గురించి తెలియజేసే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి హితేశ్‌ కేవల్యా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానాతోపాటు జితేంద్ర కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.

'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌' సినిమా విడుదలను తెలియజేస్తూ ఇటీవల స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్‌ టాట్చెల్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు.

"స్వలింగ సంపర్కుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను తెలియజేసే విధంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా చూశాక స్వలింగ సంపర్కులపై ఉన్న చిన్నచూపు పోతుందని ఆశిస్తున్నాను".

-పీటర్​ టాట్చెల్​, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త

అయితే పీటర్‌ పెట్టిన ట్వీట్‌పై ట్రంప్‌ స్పందించారు. పీటర్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. 'గ్రేట్‌' అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు.

trump tweeted on bollywood movie shubh mangal zyada saavdhan and he said great..
ట్రంప్​ ట్వీట్​

Last Updated : Mar 2, 2020, 4:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.