ETV Bharat / international

కరోనా టీకా తెచ్చేందుకు ట్రంప్​ కీలక నిర్ణయం - corona in america

కరోనా వ్యాక్సిన్​ తయారీని వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 'ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్'​కి చీఫ్​గా మాజీ ఫార్మాసిటికల్​ ఎగ్జిక్యూటివ్​ను నియమించారు.

Trump
కరోనా టీకా అభివృద్ధి వేగవంతానికి ట్రంప్​ కీలక నిర్ణయం
author img

By

Published : May 14, 2020, 11:34 AM IST

కరోనా వైరస్​ వ్యాక్సిన్​ను ఈ ఏడాది చివరి నాటికి అభివృద్ధి చేసి, పంపిణీ చేయాలన్న లక్ష్యంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ మేరకు వ్యాక్సిన్​ తయారీ స్వతంత్ర బృందం 'ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్'​కు నాయకత్వం వహించేందుకు మాజీ ఫార్మాసిటికల్​ ఎగ్జిక్యూటివ్​ను నియమించారు.

కరోనా వైరస్​ కార్యదళం​లోని స్వతంత్ర బృందం 'ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్' కు నాయకుడిగా మోన్సెఫ్​ స్లౌయిని నియమించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

" గ్లాక్సో స్మిత్​క్లైన్​ ఫార్మా సంస్థ మాజీ కార్యనిర్వాహణ అధికారి మోన్సెఫ్​ స్లౌయి.. ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్​కు నాయకత్వం వహిస్తారు. కొవిడ్​-19 కోసం వ్యాక్సిన్​ అభివృద్ధి చర్యలను వేగవంతం చేసేందుకుగాను అధ్యక్షుడు ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్లౌయి స్వచ్ఛందంగా పని చేయనున్నారు. ఆయనకు అమెరికా ఆర్మీ జనరల్ గుస్టావ్​ పెర్నా సాయం చేస్తారు." ​

– శ్వేతసౌధం అధికారి

కరోనా వైరస్​ వ్యాక్సిన్​ అభివృద్ధికి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయానికి ముందే టీకా తయారు చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు వ్యాక్సిన్​ ఒక్కటే మార్గంగా విశ్వసిస్తోంది ట్రంప్​ ప్రభుత్వం. ఈ ఏడాది చివరి నాటికి 300 బిలియన్ల డోస్​లను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.