ETV Bharat / international

ఇక నుంచి ట్రంప్​ నివాసం ఇదే... - Mar-a-Lago estate

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన శాశ్వత నివాసానికి తరలివెళ్లారు. ఇప్పటికే వైట్​హౌస్​లో ఉన్న తన సామగ్రిని ఫ్లోరిడా పామ్​ బీచ్​లోని మార్​-ఏ-లాగు ఎస్టేట్​కు తరలించారు.

Trump to make Mar-a-Lago estate his permanent home after leaving White House
రేపటి నుంచి ట్రంప్​ నివాసం అదే!
author img

By

Published : Jan 20, 2021, 5:10 PM IST

Updated : Jan 20, 2021, 7:17 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్ష హోదాలో చివరిసారిగా మెరైన్ వన్ హెలికాప్టర్​​ ఎక్కి.. ఫ్లోరిడాలోని తన శాశ్వత నివాసానికి బయలుదేరారు. ​ఇప్పటికే శ్వేతసౌధంలోని ఆయన సామగ్రిని ఫ్లోరిడా పామ్​ బీచ్​లో ఉన్న 'మార్​-ఏ-లాగు' ఎస్టేట్​కు తరలించారు.

వాషింగ్టన్​ వీడే ముందు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్​.

" ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైనవి. మనమంతా కలిసికట్టుగా చాలా సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి కృతజ్ఞతలు. మీ ప్రయత్నాలకు నా కృతజ్ఞతలు. ఈ కుటుంబం ఎంత కష్టపడి పనిచేసిందో ప్రజలకు తెలియదు "

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

శీతాకాల వైట్​హౌస్​గా పిలిచే మార్​-ఏ-లాగు ఎస్టేట్​లో ట్రంప్​ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎక్కువ కాలం గడిపారు. 2019 తరువాత ట్రంప్​ తన అధికారం నివాసంగా కూడా మార్​-ఏ-లాగు ను మార్చారు. సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఎస్టేట్​లో 128 గదులు ఉన్నాయి. 5 టెన్నిస్​ కోర్టులు, 20 వేల చదరపు అడుగుల్లో ఫుట్​బాల్​ రూం, వాటర్ ​ఫ్రంట్​ రూం లాంటి అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రైవేట్​ క్లబ్​గా ఉండగా.. ట్రంప్​కు మాత్రం ఇందులో ప్రత్యేక వసతి గదులు ఉన్నాయి. మార్కెట్​ అంచనా ప్రకారం దీని విలువ సుమారు రూ. 12 వేల కోట్ల వరకు ఉంటుంది.

ఇదీ చూడండి: కరుణామయుడైన ట్రంప్​- 143మందికి క్షమాభిక్ష

Last Updated : Jan 20, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.