ETV Bharat / international

'చైనా ఔషధ ఉత్పత్తులకు ఇక స్వస్తి ' - ట్రంప్​ తాజా వార్తలు

చైనాతోపాటు ఇతర దేశాలకు చెందిన ఔషధాలు, వాటిని సరఫరా చేసే సంస్థలకు ఇక ముగింపు పలకనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. అంతేకాకుండా రానున్న కాలంలో అమెరికాలోనే ఔషధ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ట్రంప్​.

Trump to end reliance on other nations for medical supplies
చైనా, ఇతర దేశాల ఔషధ ఉత్పత్తులను నిషేధిస్తాం
author img

By

Published : Aug 7, 2020, 3:04 PM IST

చైనా సహా ఇతర దేశాలకు సంబంధించిన ఔషధాలు, సరఫరా చేసే సంస్థలకు అమెరికా స్వస్తి చెప్పనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. కరోనా వైరస్​ ప్రపంచ దేశాలకు విస్తరించడానికి చైనాయే కారణమని మరోసారి ఆరోపించిన ట్రంప్​.. ఈ మేరకు బీజింగ్​ తగిన మూల్యం చెల్లిస్తుందన్నారు. చైనా.. తన అసమర్థతతో ఉద్దేశపూర్వకంగా చేసిన ఘోర తప్పిదానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఓహియోలోని ఓ కర్మాగారాన్ని సందర్శించిన ట్రంప్​.. అక్కడి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఒబామా- బైడెన్​లు అధికారంలో ఉన్నప్పుడు చైనా సులువుగా తమ కార్యకలాపాలు కొనసాగించిందన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. రాబోయే నాలుగేళ్లలో తమ దేశంలోనే ఔషధ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఈ విషయంలో ఇతర దేశాలపై ఏ మాత్రం ఆధారపడమని స్పష్టం చేశారు​. అందులో భాగంగా చైనా వైరస్​ను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి: 'టిక్​టాక్'​పై నిషేధానికి ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.