ETV Bharat / international

'ఫ్యాక్ట్​ చెక్​'పై ట్విట్టర్​కు ట్రంప్​ వార్నింగ్​! - twitter fact checks trump

ట్విట్టర్​లో తాను చేసిన ట్వీట్​కు ఆ​ సంస్థ ఫ్యాక్ట్ చెక్​ వార్నింగ్​ పంపడంపై.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీవ్ర హెచ్చరికలు చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలపై ఆంక్షలు విధిస్తామని, అవసరమైతే పూర్తి నిషేధం కూడా విధించేందుకు వెనుకాడనని పేర్కొన్నారు ట్రంప్​.

Trump threatens social media after Twitter fact-checks him
కొత్త నియంత్రణలతో ట్విట్టర్​కు ట్రంప్​ వార్నింగ్​!
author img

By

Published : May 28, 2020, 12:57 PM IST

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలపై కొత్త నియంత్రణలు విధిస్తానని, అవసరమైతే మూసేయడానికి కూడా వెనుకాడబోనని ఉద్ఘాటించారు. ఇటీవలే ట్విట్టర్​ వేదికగా తాను టేసిన ట్వీట్లలో తప్పుడు సమాచారం ఉందంటూ.. ఆ సంస్థ ఫ్యాక్ట్​ చెక్​ వార్నింగ్​ పంపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐటీ దిగ్గజ కంపెనీలు సంప్రదాయవాదుల గొంతు నొక్కుతున్నాయని ట్రంప్​ మండిపడ్డారు. ట్విట్టర్‌ గురించి తాము చెబుతున్నందంతా నిజమే అని ఆ సంస్ధ ఇప్పుడు అంగీకరిస్తోందని అన్నారు. వారిపై పెద్ద చర్య సిద్ధంగా ఉందని ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్రంప్‌ ప్రెస్‌ కార్యదర్శి కేలీ మెక్‌ ఎననీ వెల్లడించారు. ఈ రోజే.. ట్రంప్‌ ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు శ్వేతసౌధం అధికారులు తెలిపారు. ట్రంప్‌ హెచ్చరికలపై ట్విట్టర్‌ ఇంకా స్పందించలేదు.

ఇదీ చూడండి:'ట్రంప్‌ ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.