భారత్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా 'ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ' (జీఎస్పీ) కింద ఇచ్చే హోదాను భారత్‌కు రద్దుచేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. భారతీయ మార్కెట్లో అమెరికాకు సహేతుక, సమాన అవకాశాలు ఇస్తామని మాట ఇవ్వడంలో భారత్ విఫలం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ నెల 5 నుంచి తన నిర్ణయం అమల్లోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
"భారత మార్కెట్లలో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించడంపై భారత్ మాట ఇవ్వలేదు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే జీఎస్పీ హోదా నుంచి భారత్‌ను తొలగించడం తగిన నిర్ణయం."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కాంగ్రెస్‌లోని కీలక చట్టసభ్యులు వ్యతిరేకించారు. హోదాను రద్దు చేయకూడదని పలుమార్లు అభ్యర్థించారు. అధ్యక్షుడు నిర్ణయం అమల్లోకి వస్తే... అగ్రరాజ్యం ఏటా 300 మిలియన్ డాలర్లు నష్టపోతుందని హెచ్చరించారు.
జీఎస్పీ హోదా ఉన్న దేశాల్లో అత్యధికంగా లబ్ధిపొందిన దేశం భారత్. 2017లో జీఎస్పీ హోదాతో 5.7 బిలియన్లు ఆదా చేసుకుంది.
ఇదీ చూడండి: నీతీశ్‌ను ఒప్పించలేకపోయిన 'షా'...