ETV Bharat / international

ఐఎన్​ఎఫ్​ ఒప్పందం నుంచి వైదొలగనున్న అమెరికా

రష్యాతో దశాబ్దాల కాలం నాటి ఐఎన్​ఎఫ్​ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగనుంది. రష్యాకు అమెరికా విధించిన 60 రోజుల గడువు నేటితో ముగుస్తోంది.

US
author img

By

Published : Feb 2, 2019, 6:35 AM IST

Updated : Feb 2, 2019, 7:12 AM IST

treaty
అమెరికా, రష్యా మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న మధ్యంతర స్థాయి అణు ఆయుధాల ఒప్పందం (ఐఎన్​ఎఫ్​ ట్రీటీ) నుంచి వైదొలుగడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ఒప్పందాన్ని ఉల్లంఘించి అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపిస్తోంది అమెరికా. రష్యా అణ్వాయుధాలను నాశనం చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
undefined

ఐఎన్​ఎఫ్​ ఒప్పందం

ఇంటర్​మీడియట్​ రేంజ్​ న్యూక్లియర్​ ఫోర్స్​ (ఐఎన్​ఎఫ్)​ ఒప్పందం ఆయుధాల నియంత్రణలో చేపట్టిన మొదటి చర్యగా చెప్పవచ్చు. 1987 నాటి ఒప్పందం ప్రకారం 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల పరిధిలోని క్రూయిజ్​ క్షిపణుల ప్రయోగాన్ని నిషేధిస్తోంది ఈ ఒప్పందం

డిసెంబర్ 2018​లో ఒప్పందం నుంచి వైదొలగడానికి సాధారణ నోటిఫికేషన్​ ఇచ్చే లోపు రష్యా వెనక్కి తగ్గాలని 60 రోజుల గడువు ఇచ్చింది అమెరికా. సాధారణ నోటిఫికేషన్​ ఇచ్చిన తరువాత ఆరు నెలల్లో పూర్తి ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. 60 రోజుల గడువు నేటితో ముగియనుంది.

ప్రజల్లో ఆందోళన

ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి. ఇరు దేశాల భవిష్యత్తుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒప్పదం నుంచి వైదొలగటం సరికొత్త క్షిపణి పోరాటానికి నాంది పలుకుతున్నట్లవుతుందని అణు ఆయుధాల నిపుణులు పేర్కొంటున్నారు.

చైనాపై ఆధిపత్యానికే...

మధ్యంతర స్థాయి క్షిపణి ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా చైనాపై ఆధిపత్యానికే ఈ చర్యలు చేపడుతోందని రష్యా ఆరోపించింది. 1987 అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందంలో లేని ఆయుధాలను చైనా తయారు చేయడంపై అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. ఐఎన్​ఎఫ్​ ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్​ పరిపాలనకు చైనాను ఎదుర్కోవటానికి అవకాశం లభించనుంది. దేశాంతర, ఖండాంతర క్షిపణులను తయారు చేసే వీలు కలుగుతుందనే అమెరికా ఒప్పందం నుంచి వైదొలగాలని చూస్తోందని ఆరోపించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No stand-alone clips allowed. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Gran Canaria Arena, Las Palmas, Spain. 1st February 2019.
Olimpia Milano (black) 106-104 Gran Canaria (yellow)  
1. ++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION:
STORYLINE:
Last Updated : Feb 2, 2019, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.