ETV Bharat / international

'వ్యాక్సిన్​పై ట్రంప్ చెప్పేవన్నీ నిజాలు కావు'

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాక్సిన్​ ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవంబర్​లో ఎన్నికలకు ముందే వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు మెడికల్​ జర్నల్​ లాన్సెట్​ చీఫ్​ ఎడిటర్​ హార్టన్​. డొనాల్డ్​ మాటలు నిజాలు కావని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ సభ్యురాలు కమలా హ్యారిస్​ విమర్శలు గుప్పించారు.

Trump 'simply wrong' about October vaccine: Lancet editor
'వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలే'
author img

By

Published : Sep 6, 2020, 3:57 PM IST

కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే టీకా రాబోతుందని.. అందుకు సంస్థలకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు ట్రంప్​. అంతేకాదు నవంబరు 1 నాటికి వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపైనా.. ప్రత్యర్థి డెమొక్రటిక్​ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలో లాన్సెట్​ జర్నల్​ చీఫ్​ ఎడిటర్​ రిచర్డ్​ హార్టన్​ కూడా ట్రంప్​ వ్యాఖ్యలను ఖండించారు. అధ్యక్ష ఎన్నికల ముంగిట వ్యాక్సిన్​ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని.. ట్రంప్​ చెప్పడంలో నిజం లేదని​ అభిప్రాయపడ్డారు.

" పొరపాటు చేసి వ్యాక్సిన్​కు త్వరగా లైసెన్స్​ ఇస్తే ఒక్కసారి ఆలోచించండి ఏమౌతుందో. ఇప్పటికే టీకా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. అక్టోబర్ చివరి నాటికి ప్రజా వినియోగం కోసం వ్యాక్సిన్ కచ్చితంగా అందుబాటులోకి రాదు. ట్రంప్​ దీని గురించి తప్పుగా చెబుతున్నారు. ఆయన ఎందుకు అలా ప్రకటిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది అసాధ్యమని పక్కన ఉండే సలహాదారులు కచ్చితంగా ట్రంప్​కు సూచిస్తారు."

--రిచర్డ్​ హార్టన్, లాన్సెట్​ జర్నల్​ చీఫ్​ ఎడిటర్

రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్​ వీ' టీకా ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఇటీవలే చెప్పారు హార్డన్​. అయితే దాని విషయంలోనూ కొన్ని సూచనలు చేశారు. రష్యా టీకాను ప్రజా వినియోగం కోసం వాడే విజయవంతమైన వ్యాక్సిన్ అని భావించడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. చాలా తక్కువ మందిపై ప్రయోగించడమే ఇందుకు కారణమని వివరించారు హార్టన్​.

హ్యారిస్​ విమర్శలు..

కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న మాటల్ని.. తాను ఏమాత్రం విశ్వసించడం లేదని డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హ్యారిస్‌ అన్నారు. ట్రంప్‌ చెబుతున్నట్లుగా ఒకవేళ అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్థ్యం, భద్రతపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.

విమర్శలను తిప్పికొట్టేందుకే...

ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మారి వ్యాప్తి కట్టడి కీలక ప్రచారాస్త్రంగా మారింది. ట్రంప్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమయ్యారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు ఇప్పటి వరకు అగ్రరాజ్యంలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయటపడడానికి ట్రంప్‌.. ప్రత్యర్థులపై టీకా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే టీకా రాబోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్‌ తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.