ETV Bharat / international

ఇక విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు - statues vandalism in America

అగ్రరాజ్యంలో చెలరేగిన జాత్యహంకార నిరసనల్లో భాగంగా ఇటీవల విగ్రహాల ధ్వంసం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోని స్మారక చిహ్నాలు, విగ్రహాలను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా విగ్రహాలను ధ్వంసం చేసే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

statues
ఇక విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు
author img

By

Published : Jun 27, 2020, 11:26 AM IST

Updated : Jun 27, 2020, 12:04 PM IST

అమెరికాలో జాత్యహంకార దాడులపై ఆందోళనలు పెరుగుతున్న వేళ దేశంలో స్మారక చిహ్నాలు, విగ్రహాలను రక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ మేరకు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలు ధ్వంసం చేసే వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ మృతికి నిరసనగా పెల్లుబికిన ఆందోళనల సందర్భంగా అమెరికాలోని అనేక చోట్ల ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేశారు. శ్వేత సౌధం సమీపంలోని లాఫాయిడ్‌ పార్కులో మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు సైతం ప్రయత్నించారు.

నిరసనకారుల ఆందోళనలపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్‌ జాతీయ సంపదను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నం, ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసే వ్యక్తులను ఫెడరల్‌ చట్టం ప్రకారం శిక్షార్హులను చేస్తూ.. ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

  • I just had the privilege of signing a very strong Executive Order protecting American Monuments, Memorials, and Statues - and combatting recent Criminal Violence. Long prison terms for these lawless acts against our Great Country!

    — Donald J. Trump (@realDonaldTrump) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'కొలంబస్'కు నిరసన సెగ- విగ్రహం ధ్వంసం

Last Updated : Jun 27, 2020, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.