ETV Bharat / international

త్వరలో తాలిబన్​ నాయకుల్ని కలుస్తా: ట్రంప్​ - అమెరికా- తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం

అమెరికా- తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. త్వరలో తాలిబన్​ నాయకులను వ్యక్తిగతంగా కలవనున్నట్లు వెల్లడించారు.

త్వరలో తాలిబన్​ నాయకుల్ని కలుస్తా: ట్రంప్​

author img

By

Published : Mar 1, 2020, 5:18 AM IST

Updated : Mar 3, 2020, 12:47 AM IST

అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం జరిగిన శాంతి ఒప్పందంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. యుద్ధంపై ప్రతి ఒక్కరు విసిగిపోయారని.. సుదీర్ఘకాలం జరిగిన ఘర్షణలో ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్​. చాలా కాలంగా పోరాడిన తమ సైనికులను ఈ సందర్భంగా అభినందించారు.

'త్వరలో తాలిబన్​ నాయకుల్ని కలుస్తా'

''తాలిబన్లతో శాంతి ఒప్పందం ఎంతో చారిత్రత్మకమైనది. ఒకవేళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఎవరు ఊహించనంతగా మా సైన్యం తిరిగి వస్తుంది''.

-​ డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

త్వరలోనే తాలిబన్ల నాయకులను వ్యక్తిగతంగా కలవనున్నట్లు చెప్పిన అధ్యక్షుడు.. అఫ్గానిస్థాన్​లోని ఉగ్రవాదులను హతమార్చడంలో బ్రహ్మాండమైన విజయం సాధించినట్లు వెల్లడించారు. ఈ ఒప్పందంతో అగ్రరాజ్య సైనికులు వెనక్కి రావలసిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఒప్పందం చారిత్రాత్మకమైనదని ఉద్ఘాటించారు.

విడతల వారీగా..

ఒప్పందంపై సంతకం చేసిన 135 రోజుల్లోపు.. తొలి విడతలో భాగంగా అమెరికా, మిత్రదేశాల సేనల సంఖ్యను 13 వేల నుంచి 8,600కు తగ్గించనుంది. ఆ తర్వాత మిగతా సేనలను 14 నెలల్లోపు ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదిరింది.

ప్రభుత్వంతో చర్చలకు ఒప్పుకోవడం సహా పలు భద్రతా కట్టుబాట్లకు అంగీకరించినందుకు ప్రతిఫలంగా.. 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్‌లో మోహరించిన సైన్యాన్ని దశల వారీగా ఉపసంహరించడం ఈ దోహా ఒప్పందం ప్రధాన ఉద్దేశం. అల్‌ఖైదాతో తాలిబన్లు పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని.... అమెరికా కోరింది. సైన్యం ఉపసంహరణ, శాంతి ఒప్పందం సమాంతరంగా కొనసాగుతుందన్న అమెరికా.... భద్రతా దళాల ఉపసంహరణ రాత్రికి రాత్రే జరగదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

Last Updated : Mar 3, 2020, 12:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.