ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను విడనాడితే ఆ దేశానికి తాను ఆప్త మిత్రుడినవుతానని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అప్పుడు ఆ దేశం ధనిక దేశంగా ఎదుగుతుందన్నారు.
" ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యాన్ని దక్కనివ్వబోము. దీనికి వారు అంగీకరిస్తే ఇరాన్ సంపన్న దేశంగా మారుతుంది. వారు సంతోషంగా ఉంటారు. నేను వారికి ఆప్త మిత్రుడనవుతాను. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఇరాన్‌ను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం. గతంలో అందరూ నన్ను యుద్ధోన్మాదిగా చిత్రీకరించారు. ఇప్పుడు శాంతి కపోతంగా అభివర్ణిస్తున్నారు. ఈ రెండింట్లో నేను ఏదీ కాను. నేను ఇంగిత జ్ఞానమున్న మనిషిని. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ప్రస్తుత సంక్షోభంలో ఎలా వ్యవహరించాలో ఇరాన్ ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు ట్రంప్. ఇరాన్ నాయకత్వం చెడుగా ప్రవర్తిస్తే అది వారికే తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని హెచ్చరించారు. కానీ వారు అలాంటి చర్యలకు పాల్పడరని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఇరాన్- అమెరికా మధ్య ఎందుకింత ఉద్రిక్తత?