"ఉత్తర కొరియా ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఎంతో కాలంగా కష్టాల్లో జీవిస్తున్నారు. ఈ సమయంలో ఈ దేశంపై నూతన ఆంక్షలు అవసరం లేదనుకుంటున్నా. దీని ఉద్దేశం భవిష్యత్తులో ఆంక్షలు విధిస్తామని కాదు. నేను, కిమ్ జోంగ్ ఉన్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఉత్తర కొరియాతో వీలైనంత వరకు సత్సంబంధాలు కొనసాగించటం ఎంతో ముఖ్యమని భావిస్తున్నా. "
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అడుగులేస్తున్నామని గతవారమే ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారు. ఎలాంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.