ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనకు మరో అందమైన లేఖ రాశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా కిమ్‌తో మూడో సమావేశంపై ఆసక్తి చూపించారాయన. అయితే.. లేఖలో ఏముందో ట్రంప్ చెప్పలేదు. ఈ ఉత్తరంలో ఉన్నది వ్యక్తిగత సమాచారమని అందుకే చెప్పలేనని స్పష్టం చేశారు. ట్రంప్‌నకు గతంలోనూ కొన్ని ఉత్తరాలు రాశారు కిమ్.
అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ఇప్పటి వరకు రెండు సార్లు సమావేశమయ్యారు. తొలి భేటీలో భాగంగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు స్వస్తి పలకాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ దిశగా ఉత్తర కొరియా అడుగులు నెమ్మదిగా వేస్తున్నప్పటికీ కిమ్‌పై తనకున్న నమ్మకాన్ని కొనసాగిస్తానన్నారు ట్రంప్.
ఇదీ చూడండి : మరికాసేపట్లో కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీ