ETV Bharat / international

'కరోనా ప్రెస్​మీట్​లతో టైమ్​ వేస్ట్- నేను రాను'

అమెరికా అధ్యక్షుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిపై శ్వేతసౌధంలో రోజువారీ మీడియా సమావేశాలతో పెద్దగా ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. ఇందుకోసం తన విలువైన సమయం వృథా అవుతోందని పేర్కొన్నారు.

Trump
డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Apr 26, 2020, 10:12 AM IST

అమెరికాలో కరోనా విజృంభిస్తుంటే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. కరోనాపై రోజువారీ మీడియా సమావేశాలతో తన విలువైన సమయం వృథా అవుతుందన్నారు.

శ్వేతసౌధంలో మీడియా సమావేశాలను రద్దు చేస్తారన్న వార్తలకు ట్రంప్ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. రెండు నెలల్లో 50 మీడియా సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్ శనివారం దూరంగా ఉన్నారు.

  • What is the purpose of having White House News Conferences when the Lamestream Media asks nothing but hostile questions, & then refuses to report the truth or facts accurately. They get record ratings, & the American people get nothing but Fake News. Not worth the time & effort!

    — Donald J. Trump (@realDonaldTrump) April 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓ వర్గం మీడియా ప్రతినిధులు అసందర్భ ప్రశ్నలు వేసి విసిగిస్తారు. ఆ తర్వాత వారి ప్రసారాల్లో వాస్తవాలను కూడా వెల్లడించరు. ఈ పరిస్థితుల్లో శ్వేతసౌధంలో మీడియా కాన్ఫరెన్స్​ నిర్వహించి ఏం ప్రయోజనం?

వాళ్లకు రికార్డు రేటింగ్స్ వస్తాయి. అమెరికా ప్రజలకు మాత్రం నకిలీ వార్తలు చేరుతున్నాయి. ఈ సమావేశాలకు వెచ్చించే తన విలువైన సమయం, చేసే కృషి రెండు వృథానే."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

రెండ్రోజుల ముందు కరోనా వైరస్ సోకినవారిలోకి క్రిమి సంహారక మందులు ఎక్కించాలని వైద్యులకు సూచించి తీవ్ర దుమారానికి కారణమయ్యారు ట్రంప్. ఈ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు మండిపడ్డారు. అనంతరం తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ట్రంప్.. వ్యంగ్యంగా చేశానని చెప్పుకొచ్చారు.

వీటికి మీడియా అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే ఇంతటి దుమారం రేగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియా సమావేశానికి ఆయన హాజరు కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:అగ్రరాజ్య అధినేత 'ట్రంప్'​ సరిసాటి ఎవ్వరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.