ETV Bharat / international

కరోనా పంజా​: కొరియా సాయం కోరిన ట్రంప్​

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్​.. దక్షిణ కొరియాను వైరస్​ నిర్ధరణ కిట్లు సరఫరా చేయాలని కోరారు. ఈ విషయాన్ని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​ వెల్లడించారు.

Trump requests virus test kits from South Korea: SeoulTrump requests virus test kits from South Korea: Seoul
కరోనా ఎఫెక్ట్​: దక్షిణకొరియా సాయం కోరిన ట్రంప్​
author img

By

Published : Mar 25, 2020, 4:42 PM IST

అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా వైరస్​ నిర్ధరణకు కావలసిన కిట్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మిత్ర దేశమైన దక్షిణ కొరియాను కిట్లు సరఫరా చేయాలని కోరారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వెల్లడించారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సాధ్యమైనంత మేర అమెరికాకు సాయం చేస్తామని తెలిపారు మూన్.

చైనా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. కానీ వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి వైరస్​ను అంతే వేగంగా నియంత్రించగలిగింది. మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 3,67,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ యంత్రాంగం తెలిపింది.

వైట్​హౌస్ స్పందన..

ఇరు దేశాధ్యక్షుల మధ్య ఫోన్​​ సంభాషణ జరిగినట్లు ధ్రువీకరించింది శ్వేత సౌధం. కానీ వైరస్​ నిర్ధరణ కిట్లు ఇవ్వాలని ట్రంప్​ కోరినట్లు మాత్రం చెప్పలేదు.

ఒక్కరోజే 10 వేల కేసులు..

అమెరికాలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 10 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 55 వేలకు చేరింది. చైనా, ఇటలీ తర్వాత మూడో స్థానంలో నిలిచింది అగ్రరాజ్యం.

ఇదీ చూడండి:ఎంపీల నిధులతో అవి కొనేందుకు కేంద్రం ఓకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.