ETV Bharat / international

అమెరికా వేదికగా మూడు దేశాల చారిత్రక ఒప్పందం

అమెరికా సమక్షంలో ఇజ్రాయెల్​తో దౌత్య ఒప్పందాలు చేసుకున్నాయి యూఏఈ, బహ్రెయిన్. ఇజ్రాయెల్​తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Trump presides as Israel, Arab states sign historic pacts
అమెరికా వేదికగా మూడు దేశాల చారిత్రక ఒప్పందం
author img

By

Published : Sep 16, 2020, 5:40 AM IST

ఇజ్రాయెల్​తో యూఏఈ, బహ్రెయిన్​ చారిత్రక దౌత్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఇజ్రాయెల్​తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా అమెరికా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించారు.

ఈ చారిత్రక దృశ్యాలు చూసేందుకు వందల మంది ప్రజలు శ్వేతసౌధంలోని సౌత్​ లాన్​కు విచ్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, యూఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జయేద్​లు ట్రంప్ సంమక్షంలో ఈ ఒప్పందం సంతకాలు చేశారు. ఇజ్రాయెల్​తో సంబంధాల బలోపేతం కోసం ఇతర అరబ్, ముస్లిం దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

"చరిత్రను మార్చేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం. దశాబ్దాల విభజన, సంఘర్షణ తర్వాత పశ్చిమాసియాలో కొత్త ప్రారంభాన్ని మనం చూడబోతున్నాం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మూడు దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని 'అబ్రహం ఒప్పందం'గా వ్యవహరిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా నెలకొన్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం గురించి ఈ ఒప్పందాల్లో ప్రస్తావించలేదు.

సాధారణంగా యూఏఈ, బహ్రెయిన్​లు పాలస్తీనాకు మద్దతు ఇస్తాయి. అయితే ఇజ్రాయెల్​తో విభేదాలు సాధారణ సంబంధాలపై పడనీయకుండా చూడాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇజ్రాయెల్​తో సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకునే దిశగా యూఏఈ, బహ్రెయిన్​లను ఒప్పించగలిగారు. అమెరికా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ట్రంప్​కు కలిసొచ్చే అంశంగా ఆయన అనుచరులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.