ETV Bharat / international

తుదిదశకు అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం

చివరకి దశకు చేరుకున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ట్రంప్​, బైడెన్​ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ర్యాలీలు చేస్తున్నారు. శుక్రవారం ఇరువురి ర్యాలీలు ఆసక్తికరంగా సాగాయి. కరోనా నుంచి అమెరికా సాధారణ స్థితికి వస్తుందని డొనాల్డ్​ ఆశాభావం వ్యక్తం చేయగా.. బైడెన్​ మాత్రం.. ముందు మరింత కష్టకాలం ఉందంటూ ప్రజలను హెచ్చరించారు.

biden vs trump
తుదిదశకు అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ప్రచారాలు..
author img

By

Published : Oct 31, 2020, 4:08 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్​ 3 'ఎలక్షన డే'కు ఇంకా నాలుగు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రచారం జోరు మరింత పెంచారు ట్రంప్​, బైడెన్​. అభ్యర్థులిద్దరూ కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన మిడ్​వెస్ట్​ ప్రాంతంలో పర్యటించారు. ఇందులో ట్రంప్​ మిచిగాన్​లోనూ, బైడెన్​ లోవాలోనూ పర్యటించారు. అనంతరం ఇద్దరూ విస్కాన్సిన్​, మిన్నెసోటా ప్రాంతాల్లో ప్రసంగించారు.

ఆశ.. హెచ్చరిక

తనని ఆశావాదిగా పేర్కొన్న ట్రంప్​.. రోజు వందల మంది చనిపోయే పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో చికిత్సలు, టీకాల విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ట్రంప్​పై విమర్శలు గుప్పించిన బైడెన్​.. డొనాల్డ్​ నిర్ణయాలు వైరస్​ను మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు. తాము మాత్రం వైరస్​ కట్టడికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇప్పటికే 86 మిలియన్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రంప్​, బైడెన్​ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. అయితే పలు పోల్స్​ సర్వేల ప్రకారం రేసులో బైడెన్​ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైరస్​ ప్రభావిత ప్రాంతాల్లో...

రాష్ట్రాల్లో వైరస్​ ఆంక్షల వల్ల ఇబ్బందులు పడిన వారి మద్దతు తమకే ఉంటుందని ట్రంప్​ వ్యాఖ్యానించారు. అదే తమకు మెజార్టీ అందించి.. విజయం దిశగా నడిపిస్తుందని పేర్కొన్నారు.

వేసవి కాలంలో వైరస్​ విషయంలో ట్రంప్​ చేసిన పలు కామెంట్లను ప్రస్తావించిన బైడెన్​.. తాను ట్రంప్​ ప్రభుత్వం లాగా వైరస్​ కట్టడిలో చేతులెత్తేయనని పేర్కొన్నారు. మాస్కును తప్పనిసరి చేయడం, ఆరోగ్య కార్యకర్తలతో ప్రచారం చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు. వాటితో పాటు వ్యాక్సిన్లు, చికిత్సలపైనే దృష్టిసారిస్తామని స్పష్టం చేశారు.

"నేను దేశాన్ని షట్​డౌన్​ చేయను. ఆర్థిక వ్యవస్థను షట్​డౌన్​ చేయను. కానీ వైరస్​ను షట్​డౌన్​ చేస్తా" అంటూ ట్రంప్​ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కామెంట్​ చేశారు బైడెన్​.

ఒబామాతో సంయుక్తంగా..

శనివారం పెన్సెల్వేనియా సహా దాదాపు 12 ఈవెంట్లలో ట్రంప్​ పాల్గొననున్నారు. అయితే బైడెన్​ లోవా, విస్కాన్సిన్​, మిన్నెసోటా సందర్శనల తర్వాత శనివారం మిచిగాన్​లో అడుగుపెట్టారు. ఈ ప్రాంతంలో నల్లజాతీయులు ఎక్కువగా ఉంటారు. వారి ఓటు బ్యాంక్​ను ఆకర్షించేందుకు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాతో కలిసి సంయుక్త ర్యాలీలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.