ETV Bharat / international

ట్రంప్​ డెడ్​లైన్​: టిక్​టాక్​ ఆస్తులను 90 రోజుల్లోపు.. - టిక్​టాక్​పై నిషేధం

అమెరికాలోని టిక్​టాక్​ ఆస్తులను 90 రోజుల్లోగా విక్రయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థ సేకరించిన సమాచారాన్ని కూడా మళ్లించాలని స్పష్టం చేశారు.

TRUMP TIKTOK
టిక్​టాక్​
author img

By

Published : Aug 15, 2020, 10:17 AM IST

అమెరికాలోని టిక్​టాక్ ఆస్తులను ఇతరులకు విక్రయించాలని దాని మాతృసంస్థ బైట్​డాన్స్​ను నిర్దేశించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు 90 రోజుల గడువు నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.

అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీసే చర్యలు బైట్​డాన్స్​ చేపట్టే అవకాశం ఉందని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికాలో టిక్​టాక్ సేకరించిన సమచారాన్ని కూడా మళ్లించాలని ట్రంప్ ఆదేశించారు.

చైనా యాప్​లపై నిషేధం..

చైనా ఆధారిత యాప్​లైన టిక్​టాక్, వీచాట్​ను దేశంలో నిషేధిస్తూ ట్రంప్ గతవారం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థలకు వీటి ద్వారా ప్రమాదం ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెప్టెంబర్​ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

ట్రంప్ ఆదేశాలను సవాలు చేస్తూ టిక్​టాక్​తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి: టిక్​టాక్​ నిషేధంపై ఉద్యోగుల న్యాయపోరాటం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.