అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు.. తన ట్వీట్ల గురించి పశ్చాత్తాపపడుతుంటానని అంగీకరించారు. ఇది 'చాలా తరచు'గా జరుగుతుంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్.. బార్స్టూల్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"పాత రోజుల్లో లేఖ రాసి, దానిని పోస్టు చేసే ముందు పునః పరిశీలించడానికి చాలా సమయం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఇప్పుడు ఓ ట్వీట్ చేసేటప్పుడు అది చూడడానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. వెంటనే దానిని పోస్టు చేసేస్తాం. కానీ తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీరు ట్వీట్ చేసినది నిజమేనా? అదే మీ ఉద్దేశమా? అని. నిజానికి ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశం. ఇది నా విషయంలో చాలా తరచుగా జరుగుతూ ఉంది. దీనికి నేను పశ్చాత్తాపపడుతున్నాను."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని ట్వీట్లు, రీటీట్లు చాలా దుమారం రేపాయి. ముఖ్యంగా 'వైట్ పవర్', 'యాంటీ సెమిటిక్' మెసేజ్లు సహా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోనీ ఫౌచీపై చేసిన రీట్వీట్స్పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే అప్పట్లో ట్రంప్ వాటిని కొట్టిపారేశారు.
ఇదీ చూడండి: 4 దశాబ్దాల తర్వాత ఆ చైనా కాన్సులేట్ మూసివేత