ETV Bharat / international

ట్రంప్‌ గెలవాలంటే ఇదొక్కటే మార్గం! - ట్రంప్​ బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ విజయం దాదాపు ఖరారైనట్లే అందరూ భావిస్తున్నారు. గణాంకాలు కూడా ఇలానే ఉన్నాయి. అయితే ట్రంప్​కు విజయావకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ట్రంప్ గెలవాలంటే ఆయన ముందున్న దారి ఇదే.

Trump
ట్రంప్‌ గెలవాలంటే ఇదొక్కటే మార్గం!
author img

By

Published : Nov 6, 2020, 1:42 AM IST

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఓ వైపు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో శ్వేతసౌధానికి బాటలు వేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు కూడా విజయావకాశాలు లేకపోలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలవాలంటే ఆయన ముందు ఒకే ఒక్క అవకాశం ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎలక్టోరల్‌ ఓట్లన్నీ ట్రంప్‌కే దక్కాలి. అయితే అది అంత సులభంగా సాధ్యమయ్యేలా కన్పించట్లేదు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో ఉన్నారు. ఇక ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుని ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. ఓట్ల లెక్కింపు జరుగుతున్న జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, నెవాడా, అలస్కా రాష్ట్రాల్లో ట్రంప్‌ తప్పనిసరిగా గెలుపొందాలి. జార్జియాలో 16, పెన్సిల్వేనియాలో 20, నార్త్‌ కరోలినాలో 15, నెవాడాలో 6, అలస్కాలో 3 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ గెలిస్తేనే ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటారు.

జార్జియాలో ట్రంప్‌ గెలిస్తే..

కాగా.. కీలక రాష్ట్రమైన జార్జియాలో ట్రంప్‌, బైడెన్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అక్కడ దాదాపు 99 శాతం ఓట్లు లెక్కింపు పూర్తవగా.. ఫలితాల్లో ట్రంప్‌.. బైడెన్‌ కంటే 13 వేల ఓట్ల(0.2) ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో మరింత స్వల్ప ఆధిక్యం ఎవరికి వస్తే వారికే అక్కడి 16 ఎలక్టోరల్‌ ఓట్లు లభిస్తాయి. దీంతో జార్జియా ఫలితం ఉత్కంఠగా మారింది. జార్జియాలో ట్రంప్‌ గెలిస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల ఫలితం మరింత ఉత్కంఠగా మారనుంది. అటు పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కాలోనూ ట్రంప్‌ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

నెవాడా కష్టమే..

ఇక మిగిలింది నెవాడా. 2016లో ఇక్కడ హిల్లరీ క్లింటన్‌ విజయం సాధించారు. డెమొక్రాట్లకు పూర్తి ఆధిపత్యం ఉన్న ఈ రాష్ట్రంలో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఇక్కడ బైడెన్‌ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో నెవాడాలోని ఎలక్టోరల్‌ ఓట్లు ట్రంప్‌కు రావడం కాస్త కష్టంగానే కన్పిస్తోంది.

ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తోన్న ట్రంప్‌ న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో దావా వేశారు. ఈ నేపథ్యంలో అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.