ETV Bharat / international

ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు ట్రంప్​

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటం చేస్తోన్న అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కీలక రాష్ట్రాల్లోని 62 ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు చెల్లవంటూ టెక్సాస్​ అటార్నీ జనరల్​ దాఖలు చేసిన పిటిషన్​లో తమను కూడా కక్షిదారుగా చేర్చుకోవాలని కోరారు ట్రంప్​.

Trump knocks US Supreme Court's door
ఎన్నికల ఫలితాలపై సుప్రీం కోర్టుకు ట్రంప్​
author img

By

Published : Dec 10, 2020, 10:48 AM IST

నవంబర్​ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికలపై మొదటి నుంచే ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. డెమొక్రటిక్​ అభ్యర్థి, ఎన్నికల విజేత జో బైడెన్​కు అనుకూలంగా రిగ్గింగ్​ జరిగిందని ఆరోపించారు. తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తూ.. ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటానికి దిగారు. తాజాగా సుప్రీం కోర్టు తలుపుతట్టారు ట్రంప్​.

ట్రంప్ ఇంప్లీడ్​ పిటిషన్​

జార్జియా, మిషిగన్​, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​లోని మొత్తం 62 ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు చెల్లవంటూ టెక్సాస్​ అటార్నీ జనరల్​ కేన్​ పాక్ట్సన్​ సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్​ దాఖలు చేశారు. ఇదే కేసులో తనను కూడా కక్షిదారుగా చేర్చుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు ట్రంప్​.

" త్వరలోనే ధైర్యం అనే పదం గురించి తెలుసుకుంటాం. దేశాన్ని రక్షిస్తాం. అన్ని స్వింగ్​ స్టేట్స్​లో నా ప్రత్యర్థి కన్నా.. వేల సంఖ్యలో లీగల్​ ఓట్లు సాధించా. ఓటింగ్​ తర్వాత సేకరించిన డేటా ప్రకారం.. అక్రమాలు జరిగితే తప్ప నేను ఓడిపోవటం అసాధ్యం అని తేలింది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

పలు రాష్ట్రాల్లో ఎన్నికల నియమాలను ఉల్లంఘించటం వల్ల ఒక అభ్యర్థిగా తన హక్కులు కాపాడుకునేందుకు అధ్యక్షుడు కలుగజేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రచార బృందం తెలిపింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్​ ఓట్లలో బైడెన్​కు 306 ఓట్లు వచ్చాయి. కావాల్సిన మెజారిటీ 270కి మించి ఓట్లను సొంతం చేసుకున్నారు.

ఇదీ చూడండి: జో బైడెన్​ కుమారుడిపై ఫెడరల్​ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.