జపాన్‌లో జరుగుతున్న జీ-20 సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సరదాగా జోక్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని ఛలోక్తులు విసిరారు.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా రష్యా జోక్యం చేసుకుందని అగ్రదేశంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతేడాది ఫిన్లాండ్లోని హెల్సింకీలో పుతిన్-ట్రంప్ భేటీపైనా దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంలోనే ట్రంప్ ఇలా జోక్ వేసి అందరినీ నవ్వించారు.
పుతిన్‌తో తనకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఆయనను జీ-20 సదస్సు సందర్భంగా కలుసుకున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
రష్యాలో పర్యటించండి...
రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్ష దేశాలు విజయం సాధించాయి. ఆ గెలుపు సంబరాలను వచ్చే ఏడాది రష్యాలోని క్రెమ్లిన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని ట్రంప్‌ను పుతిన్ ఆహ్వానించారు.
ఆధారాల్లోవ్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ చేపట్టిన రాబర్ట్ మ్యూలర్ కమిటీ.. అందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు