ETV Bharat / international

మొదటి వీటో జారీ చేసిన ట్రంప్ - అత్యయిక స్థితి

గోడ నిర్మాణానికి వస్తున్న అడ్డంకులను ఎదుర్కొనేందుకు మొదటిసారిగా వీటో అధికారాన్ని ఉపయోగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిధుల సమీకరణ కోసం విధించిన అత్యయిక స్థితికి కాంగ్రెస్​లో ఆమోదం లభించకపోవటంతోనే నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు.

మొదటి వీటో జారీ చేసిన ట్రంప్
author img

By

Published : Mar 16, 2019, 7:11 AM IST

మెక్సికో సరిహద్దు గోడపై తన పంతం నెగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపక్రమించారు. కాంగ్రెస్ వ్యతిరేకించినా అత్యయిక స్థితి కొనసాగించేలా విచక్షణ(వీటో) అధికారాన్ని ఉపయోగించారు. వీటోను ట్రంప్ పదవీకాలంలో ఉపయోగించటం ఇదే మొదటిసారి.

"అత్యయిక స్థితిపై తీర్మానించేందుకు కాంగ్రెస్​కు పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే వీటోను ఉపయోగించుకునేందుకు నాకు అంతే స్వేచ్ఛ ఉంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తాపత్రయ పడట్లేదని ప్రకటించారు ట్రంప్. మరోసారి అధ్యక్షునిగా ఉంటానా లేదా అన్నది తెలియడానికి మరో 18 నెలలు సమయం ఉందని పేర్కొన్నారు.

అత్యయిక స్థితిని వ్యతిరేకిస్తున్న డెమొక్రాట్లకు సెనేట్​లో 12 మంది రిపబ్లికన్​ సభ్యులూ మద్దతునిస్తున్నారు. ట్రంప్​ వీటోను బుట్టదాఖలు చేసేందుకు కాంగ్రెస్​లో 2/3వ వంతు సభ్యులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఎలాగైనా అత్యయిక స్థితి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ సభ్యులు.
ఎమర్జెన్సీ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనది కాదని డెమొక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల అటార్నీ జనరల్స్ సైతం వాదిస్తున్నారు.

Abu Dhabi (UAE), Mar 16 (ANI): Athletes from India reached Abu Dhabi to participate in Special Olympics World Games 2019. Over 7000 athletes will compete in 24 sports at the Special Olympics in Abu Dhabi. Special Olympics will host more than 170 countries this year. An athlete, Aparimita Singh is representing India in the 100m and 200 m races at the Special Olympics. Talking to ANI she said, "I have been practicing for a long time that si why I have reached here." The game saw a spell-bounding opening ceremony in Abu Dhabi on Thursday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.