ETV Bharat / international

'భారత్​తో సంబంధాల బలోపేతానికి ట్రంప్​ చాలా చేశారు' - us india ties news

భారత్​తో సంబంధాల బలోపేతానికి డొనాల్డ్​ ట్రంప్ చేసినంత కృషి గతంలో ఏ అమెరికా ప్రభుత్వం చేయలేదని శ్వేతసౌధం తెలిపింది. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత దృఢం చేసేందుకు మున్ముందు కూడా ట్రంప్​ దీనిని కొనసాగిస్తారని పేర్కొంది.

Trump has elevated ties with India in ways not seen under any other US prez: White House
భారత్​తో సంబంధాల బలోపేతానికి ట్రంప్​ చాలా చేశారు.
author img

By

Published : Aug 18, 2020, 11:01 AM IST

గతంలో ఏ అమెరికా ప్రభుత్వం చేయని విధంగా భారత్​తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎంతో కృషి చేశారని శ్వేతసౌధం వెల్లడించింది. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యాలను ఆయన కొనసాగిస్తారని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

"భారత్​తో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యమిచ్చారు. గత మూడున్నరేళ్లుగా అన్ని రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారు. కొవిడ్ సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్​నిర్మించేందుకు, సరఫరా గొలుసులను బహుముఖం చేసేందుకు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం కీలక భాగస్వామ్యం నెలకొల్పేందుకు తన వంతు కృషి ట్రంప్​ చేస్తూనే ఉంటారు. సాయుధ ఎంక్యూ-9 మానవరహిత విహంగ నిఘా వ్యవస్థను అమెరికా నుంచి పొందుతున్న మొట్టమొదటి ఒప్పందేతర మిత్రదేశంగా భారత్​ ఉందంటే అందుకు ట్రంపే కారణం. ఫిబ్రవరి 24-26 తేదీల్లో ట్రంప్​ భారత్​లో పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య బంధాన్ని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచారు. ట్రంప్ 2017లో​ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాక శ్వేతసౌధాన్ని మొదటగా సందర్శించిన నాయకుల్లో మోదీ ఉన్నారు.

2019 సెప్టెంబరులో హ్యూస్టన్​లో నిర్వహించిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో 55వేల మంది పాల్గొన్నారు. 2020 గుజరాత్​ అహ్మదాబాద్​లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో లక్షా 10వేల మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలతో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రక్షణ, భద్రత సహకారంలో పరస్పర ప్రయోజనాల కోసం దృఢమైన భాగస్వామ్యానికి ట్రంప్​ కృషి చేశారు. భారత్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా అమెరికా ఉంది. 3 బిలియన్ డాలర్ల మేర రక్షణ కొనుగోళ్లు జరిగాయి."

-శ్వేతసౌధం సీనియర్ అధికారి.

ఇదీ చూడండి: హువావేపై అమెరికా ఆంక్షలు కఠినతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.